టైమ్ చూసి సీఎంను దెబ్బ కొడుతున్న సొంత పార్టీ లీరడ్, అందరూ బాగుండాలంటే ఇలాగేనా ?
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించిన సీనియర్ నేత బీకే హరిప్రసాద్ మరోసారి కర్ణాటక సీఎం సిద్దరామయ్య మీద పరోక్షంగా విరుచుకుపడ్డారు. తనను ఎత్త తొక్కాలని ప్రయత్నించినా తాను బంతిలా పైకి దూసుకుపోతానని పరోక్షంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విరుచుకుపడ్డారు. బెంగళూరులో జరుగుతున్న ఈడిగ కులస్తుల సమావేశం జరుగుతున్న సమయంలో బీకే హరిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరులో జరుగుతున్న ఈడిగ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బీకే హరిప్రసాద్ హాజరుకాలేదు. ఆదివారం హుబ్బళ్లిలో విలేకరులతో మాట్లాడిన బీకే హరిప్రసాద్ ఈడిగ సంఘంలో చాలా పెద్ద నాయకులు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారని, ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి, సమాజ శ్రేయస్సును కాపాడటానికి సంఘం ఉనికిలో ఉందని బీకే హరిప్రసాద్ అన్నారు.

అయితే ఇటీవల వచ్చిన కుల సంఘం నాయకులు సమాజానికి ఏం చేస్తున్నారని బీకే హరిప్రసాద్ ప్రశ్నించారు. 50 లక్షల జనాభా ఉన్న ఈడిగ సొసైటీకి కేవలం పన్నెండు వేల మంది సభ్యులున్న సంఘం ప్రాతినిధ్యం వహించదని బీకే హరిప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఇది రాజకీయ సమావేశం, నేనేదో ఊరికే చెప్పడం లేదని బీకే హరిప్రసాద్ అన్నారు. బిల్లవ సామాజికవర్గానికి చోటు కల్పించిన ఆయన సమాజానికి ఏం చేశారో చెప్పాలని బీకే హరిప్రసాద్ సంఘంలోని కొందరు నాయకులను ప్రశ్నించారు.
కేవలం బిల్లవ సమాజానికి బాస్కెట్‌బాల్ అసోసియేషన్‌కు అప్పగించారు. గురు నారాయణ అధ్యయన కేంద్రానికి నిధులు ఇవ్వలేదని, సమాజహితం కోసం ఏం చేశారో చెప్పాలని పరోక్షంగా సిద్దరామయ్య ప్రభుత్వాన్ని అదే పార్టీకి చెందిన బీకే హరిప్రసాద్ ప్రశ్నించారు. రాజకీయ ప్రేరేపితంగా బెంగళూరులో జరుగుతున్న ఈడిగ సదస్సుకు నేను వెళ్లలేదని, ఈ సమావేశానికి ఈడిగ కులానికి చెందిన ఇద్దరు స్వామీజీలను కూడా ఆ సంఘం ఆహ్వానించలేదని బీకే హరిప్రసాద్ అన్నారు.
ముఖ్యమంత్రులు, డీసీఎంలు పాల్గొంటున్నారు. వారికి శుభాకాంక్షలు అని బీకే హరిప్రసాద్ అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన తాను ఈ రోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని బీకే హరిప్రసాద్ అన్నారు. ఆపరేషన్ కమల్‌లో బీజేపీ మాస్టర్స్ డిగ్రీ కూడా చేశారని బీజేపీ మీద బీకే హరిప్రసాద్ మండిపడ్డారు. బెళగావిలో శాసన సభ సమావేశాలు బాగా జరుగుతున్నాయని, ఉత్తర కర్ణాటక సమస్యలపై వీలైనంత చర్చిస్తున్నామని బీకే హరిప్రసాద్ మీడియాకు చెప్పారు.

బీకే హరిప్రసాద్ , సీఎం సిద్ధరామయ్యల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. మంత్రి పదవి ఆశించిన బీకే హరిప్రసాద్‌కు హ్యాండ్ ఇచ్చిన సీఎం సిద్ధరామయ్య మరో ఈడిగ సంఘం నేత మధు బంగారప్పకు మంత్రి పదవి ఇచ్చారు. హ్యాట్రిక్ శివరాజ్ కుమార్ కు మధు బంగారప్ప బావమరిది అవుతారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా సీఎం సిద్దరామయ్య అవమానించారని కొంతకాలంగా బీకే హరిప్రసాద్ సీఎం సిద్దరామయ్య మీద మండిపడుతున్నారు.
సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ లను ఈడిగ సమాజం సమావేశానికి ఆహ్వానించి తనను ఆహ్వానించలేదని బీకే హరిప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. తనను ఎంత తొక్కాలంటే అంత పైకి బంతిలాగా ఎగురుతానని మరోక్షంగా మంత్రి మధు బంగారప్ప మీద బీకే హరిప్రసాద్ విరుచుకుపడ్డారు. మొత్తం మీద కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బీకే హరిప్రసాద్ వీలు చిక్కినప్పుడు విరుచుకుపడుతున్నారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications