అర్దరాత్రి సీఎం, డీకే, హోమ్ మంత్రితో హైకమాండ్ చర్చలు, ఏం చెయ్యాలి ?, ఎలా చెయ్యాలి ?

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 నియోజకవర్గాల్లో కనీసం 20 స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆ పార్టీలో అసంతృప్తిని బుజ్జగించేందుకు సిద్దం అయ్యింది. పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులకు కార్పోరేషన్‌ బోర్డుల చైర్మన్‌గా నియమించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది.

బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌లో కర్ణాటకట రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా నేతృత్వంలో మంగళవారం అర్థరాత్రి వరకు ఆ పార్టీ నాయకుల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లతో రణదీప్ సింగ్ సూర్జేవాల సమావేశమై కార్పోరేషన్ చైర్మన్ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. అదే సమయంలో రణదీప్ సింగ్ సుర్జేవాలా అసంతృప్త ఎమ్మెల్యేలతో ఫోన్‌లో మాట్లాడారు.

Senior Congress leader Randeep Singh Surjewala held talks with CM, DCM and Home Minister at Star Hotel.

ఇంకా ఈసమావేశంలో హోంమంత్రి జీ. పరమేశ్వర్, సీనియర్ మంత్రి కేజే జార్జ్ కూడా పాల్గొన్నారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే రణదీప్ సింగ్ సూర్జేవాలా సీనియర్ ఎమ్మెల్యేలకు ఫోన్ లు చేసి జాబితా ప్రచురించిన తర్వాత వివాదం చేయవద్దని, తరువాత మీకు అవకాశం ఇస్తామని, అందరూ సర్దుకుని పోవాలని వారికి సూచించారని తెలిసింది. అలాగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్పోరేషన్‌ బోర్డుల పదవులు వచ్చిన వారు కచ్చితంగా పని చెయ్యాలని సూచించారని తెలిసింది.

కార్పోరేషన్ చైర్మన్ ల బాధ్యతలు తీసుకున్న తరువాత కష్టపడి పని చెయ్యాలని సూర్జేవాలా ఆ పదవులు తీసుకుంటున్న వారికి సూచించినట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే 85 కార్పోరేషన్లు ఉండగా ఆ పదవుల్లో నియమించేందుకు కర్ణాటక ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. కార్పోరేషన్లు, బోర్డుల చైర్మన్లు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులు, డైరెక్టర్లు నియమించడానికి కర్ణాటక ప్రభుత్వానికి అధికారం ఉంది.

ఈ సందర్భంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు మంచి పదవులు ఇస్తామని, పార్టీ సంస్థాగత, కార్పొరేషన్‌ బోర్డు నియామకంపై మా నేతలతో చర్చలు జరిగాయన్నారు. ఎమ్మెల్యేల కు బాధ్య త లు అప్పగించే విషయంలో తొలిదశ చర్చలు జరిగాయని, త్వరలో పూర్తిస్థాయిలో చర్చలు జరిపి తుదినిర్ణయం తీసుకుంటామని డీకే శివకుమార్ అన్నారు.

Senior Congress leader Randeep Singh Surjewala held talks with CM, DCM and Home Minister at Star Hotel.

ప్రస్తుతం జాబితాను కేంద్ర నేతలు పరిశీలించనున్నారని, ఆ తర్వాత రెండో రౌండ్ చర్చలు ఉంటాయని డీకే శివకుమార్ చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎంత సమయం కావాలని మీడియా అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని, తాను, ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని డీకే శివకుమార్ అన్నారు.

కార్పోరేషన్ చైర్మన్ ల నియామకంలో కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ అసహనంతో ఉన్నారని తెలిసిందని, ఏందుకు ఆయన అలా ఉంటున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ సమాధానం ఇచ్చారు. బెళగావి నుంచి నేరుగా హోటల్ కు వచ్చిన హోమ్ మంత్రి పరమేశ్వర్ తరువాత రణదీప్ సింగ్ సుర్జేవాలాతో, సీఎం సిద్దరామయ్యతో, తనతో చర్చించారని, ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పోరేషన్ చైర్మన్ ల పదవులు ఇస్తామని, లోక్ సభ ఎన్నికల్లో అందరూ కలిసి పని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నామని డీకే శివకుమార్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+