ధోనీ పోటీపడేది అతడితోనే
క్రికెట్ లో ఎంఎస్ ధోనీ(MS Dhoni) అంటేనే ఓ సంచలనం. టీమిండియాకు రెండోసారి ప్రపంచకప్ అందించినా, ఐపీఎల్ లో చెన్నై జట్టును 5వ సారి విజేతగా నిలబెట్టినా ఆ క్రెడిట్ అంతా ధోనీకే దక్కుతుంది. మంచి వ్యూహకర్తగా పేరు తెచ్చుకుంటూ ఎంతోమంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. అతడి గొప్పతనం గురించి తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒక విషయాన్ని టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా వెల్లడించారు. తన ఆలోచనా విధానంతో ధోనీ లెజెండ్ గా ఎలా మారాడో చెప్పారు.
2004లో టీమ్‌ఇండియా జింబాబ్వే, కెన్యా పర్యటనకు వెళ్లింది. అప్పుడు ధోనీ కంటే దినేశ్ కార్తిక్‌కు జట్టులో ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. డీకే తుది జట్టులో, మహి రిజర్వు కీపర్ గా ఉన్నాడు. నెట్స్ లో డీకేకు ధోనీ బౌలింగ్ చేస్తున్నాడు. తాను వెంటనే మహీ దగ్గరకు వెళ్లి.. అతను నీకు పోటీకదా.. అతను బాగా ఆడితే నీకు అవకాశాలు రావు.. అతడికి ఎందుకు బౌలింగ్ చేస్తున్నావు అని అడిగినట్లు ఆకాశ్ చోప్రా తెలిపారు. బ్యాటింగ్ లేదంటే కీపింగ్ ప్రాక్టీస్ చేయాలికానీ అలా బౌలింగ్ చేయొద్దు అని చెప్పానన్నారు.

వెంటనే ధోనీ తనను ఆపొద్దని, బౌలింగ్ చేయాలని అన్నాడు. అవసరమైతే నన్ను కూడా బ్యాటింగ్ చేస్తానంటే బౌలింగ్ చేస్తానని బదులిచ్చాడని చెప్పారు.ధోనీ ఆలోచనా విధానం అతణ్ని ఎంత విజయవంతమైన క్రికెటర్ గా మార్చిందో అర్థమైందన్నాడు. ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్ గా మారాడాన్నారు. ధోనీ చెప్పిన సమాధానంలోని అర్థం తెలిసిందని, కావాలనుకున్నదాన్ని అతడు ఎలా సాధించాడో అర్థమైందన్నారు.
దినేష్ కార్తీక్ తో సహా ఏ ఆటగాణ్ని అతను పోటీ అనుకోలేదని, అతడితో అతడే పోటీపడ్డాడని, నీకు నువ్వే పోటీ అని, ఎప్పుడూ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండాలన్నాడు. తన గేమ్ లో ధోనీ మాస్టర్ అని, గొప్పతనాన్ని తిరిగి ఆవిష్కరించుకుంటూనే ఉంటాడన్నారు. అతడికి ఎవరైనా పోటీ ఉన్నారంటే.. అతడే పోటీ అన్నారు.












Click it and Unblock the Notifications