విజయ్ కు 20 శాతం పైగా ఓట్లొస్తే ? సీఎం ఎవరో చెప్పేసిన జర్నలిస్ట్ ఎన్ రామ్..!
తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీకి ఈసారి జరుగుతున్న ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టీ నెలకొంది. దీనికి కారణం అక్కడ రెండు ప్రధాన కూటములు డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు విజయ్ కొత్త పార్టీ టీవీకే బరిలో ఉండటమే. సినీ పరిశ్రమకూ, రాజకీయాలకు రాష్ట్రంలో ఉన్న సంబంధాలు కూడా ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో తమిళనాడు పోలింగ్, ఫలితాలపై ఆసక్తి మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ ఎన్. రామ్ (N Ram) తమిళనాడు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై నటుడు-రాజకీయవేత్త విజయ్ యొక్క టీవీకే ప్రభావం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ మాట్లాడుతూ.. "ఒకవేళ విజయ్ 20% కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే, అది ఎక్కువ సీట్లను తెచ్చిపెట్టకపోవచ్చన్నారు. కానీ ఆయన అంత సాధిస్తే, అది సాధారణం కంటే చాలా పెద్ద విజయం అవుతుందని భావిస్తున్నట్లు ఎన్. రామ్ తెలిపారు. అలాగే డీఎంకే కూటమికి దాదాపు 180 సీట్లు వస్తాయన్న సర్వే నివేదికలపై కూడా ఆయన స్పందించారు.

VIDEO | Tamil Nadu Election 2026: Senior journalist N Ram on impact of actor-turned-politician Vijay's TVK on assembly election, says, "If Vijay scores, let's say, over 20% of the vote. That may not translate to many seats. But if he scores that, then I think it will be a much… pic.twitter.com/bfdvQqSXoM
— Press Trust of India (@PTI_News) April 23, 2026
మీరు కూటమికి దాదాపు 180 సీట్లు వస్తాయని మాట్లాడుతున్నారని, కానీ సాధారణ పరిస్థితుల్లో, డీఎంకే నేతృత్వంలోని కూటమికి 155, 160 సీట్లు వస్తాయని, డీఎంకేకు ఏకపక్ష మెజారిటీ వస్తుందని ఆశించవచ్చని ఎన్ రామ్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వారి సంస్థాగత నిర్మాణం కూడా బలంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి పనిచేసిన తీరును తాను చూశానన్నారు. దీన్ని బట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది రామ్ తేల్చేసినట్లయింది.












Click it and Unblock the Notifications