షాకింగ్ న్యూస్: విధానసభలోనే మంత్రి రాసలీలలు!
బెంగళూరు: కార్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని మరో మంత్రి రాసలీల బాగోతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే టిప్పు సుల్తాన్ జయంతి రోజున రాష్ట్ర ప్రాథమిక విద్యా మంత్రి తన్వీర్‌సేఠ్ వేదికపైనే ఫోన్‌లో నీలిచిత్రాలను చూస్తూ మీడియా కంటపడ్డం తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్‌వై మేటీ ఏకంగా విధానసౌధలోని తన కార్యాలయంలో రాసలీలలు సాగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బాగల్‌కోటేకు చెందిన ఓ ఉద్యోగిని బదిలీ విషయమై కొన్నిరోజుల ముందు మేటీ వద్దకు వచ్చింది. మేటీ ఆమెతో తన కార్యాలయంతో పాటు వివిధ చోట్ల పలు దఫాలుగా రాసలీలలు సాగించారని ఆరోపణలొచ్చాయి. ఈ అశ్లీల దృశ్యాలను ఆయన మాజీ గన్‌మేన్ సుభాష్ రహస్యంగా చిత్రీకరించాడు. అనంతరం ఆ మహిళతో కలిసి మంత్రిని బెదిరించారు.

రూ.15 కోట్లు ఇవ్వకుంటే వీడియోలను బయటపెడతామని బెదిరించడంతో.. మంత్రి మేటీ రూ.15 లక్షలు ఇస్తానన్నారు. కాగా, ఇదే సమయంలో రాజశేఖర్ అనే ఆర్టీఐ కార్యకర్త కొన్ని ప్రసార మాధ్యమాలకు రాసలీలల వీడియోలను ఇవ్వడానికి యత్నించారు. దీంతో మంత్రి అనుచరులు ఫోన్‌లో రాజశేఖర్‌ను బెదిరించారు.
కాగా, రాజశేఖర్ బళ్లారిలోని గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. అయితే, తానెలాంటి తప్పూ చేయలేదని మేటీ చెబుతున్నారు. 'నా భార్యతో ఉన్నప్పుడు వీడియోలు తీస్తే ఏం చేయాలి?' అని వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఆ వీడియో సీడీని విడుదల చేయనివ్వండి అని అన్నారు. అంతేగాక, తాను ముసలివాడినని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications