వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాజీనామా: కుమారుడు బీజేపీలో చేరడంతో మనస్తాపం!

|
Google Oneindia TeluguNews

ముంబై: లోక్ సభ ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని విఘాతం తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాధాకృష్ణ వీఖే పాటిల్ మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అందజేశారు. నైతిక కారణాల వల్ల తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వీఖే పాటిల్ ఈ పత్రంలో పేర్కొన్నారు.

జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి ఆకుల రాజీనామా:మాగంటి రూప గెలుపు కోసం టీడీపీతో లోపాయకారి ఒప్పందాలే కారణమా?

రాధాకృష్ణ వీఖే పాటిల్ కుమారుడు, న్యూరోసర్జన్ స్పెషలిస్ట్ సుజయ్ వీఖే పాటిల్ కొద్దిరోజుల కిందటే భారతీయ జనతాపార్టీ తీర్థాన్ని పుచ్చుకున్న విషయం తెలిసిందే. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాధాకృష్ణ పార్టీని వీడినట్లు చెబుతున్నారు. రాధాకృష్ణ దగ్గరుండి తన కుమారుడిని బీజేపీలో చేర్పించారంటూ కాంగ్రెస్ పొత్తు పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో ఉద్దేశపూరకంగా జాప్యం చేస్తున్నారంటూ ఎన్సీపీ నాయకులు ఆరోపించారు.

Senior Maharashtra Congress leader Radhakrishna Vikhe Patil quits after son joins BJP

అహ్మద్ నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగబోయే తన కుమారుడు సుజయ్ కు వ్యతిరేకంగా తాను పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేనని రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఆయా కారణాల వల్లే తాను బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పారు. సుజయ్ వీఖే పాటిల్ బీజేపీలో చేరడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుపట్టారు. రాధాకృష్ణ వీఖే పాటిల్ ఏ పార్టీ వైపు ఉన్నారో స్పష్టం చేయాలంటూ విమర్శలు గుప్పించారు.

English summary
Congress's Radhakrishna Vikhe Patil has quit as Maharashtra Leader of Opposition days after his son joined BJP. This comes as a major blow to Congress ahead of the Lok Sabha elections and Maharashtra assembly elections due in some months. Radhakrishna Vikhe Patil on Tuesday handed over his resignation to Congress president Rahul Gandhi on "moral grounds".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X