సెప్టెంబర్ 23వ తేదీన పబ్లిక్ హాలిడే కోసం: ఆ మహావీరుడి కోసం
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌ను పరిపాలించిన మహారాజా హరి సింగ్ జయంతి రోజైన సెప్టెంబర్ 23వ తేదీని పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. రాజ్‌పుత్ సామాజికవర్గానికి చెందిన నెటిజన్లు ఈ డిమాండ్‌ను లేవనెత్తారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద లక్షల సంఖ్యలో పోస్టింగులు చేస్తోన్నారు. కాశ్మీర్‌ను భూతల స్వర్గంగా మార్చిన మహారాజా హరి సింగ్‌కు ఘనమైన నివాళిని అర్పించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని నినదిస్తోన్నారు. #September23holiday హ్యాష్‌ట్యాగ్ ట్రెడింగ్ అవుతోంది.
మహారాజా హరి సింగ్ కుమారుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు కరణ్ సింగ్ కూడా ఇదే డిమాండ్ వినిపించారు. తన తండ్రి మహారాజా హరి సింగ్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 23న పబ్లిక్ హాలీడేగా ప్రకటించాలని కోరారు. జమ్ముూకాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాశారు. జమ్మూ కాశ్మీర్‌లో నివసిస్తోన్న రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందినవారు కొద్దిరోజులుగా నిరసనలను చేస్తోన్నారని, వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జమ్మూ కాశ్మీర్‌ను పరిపాలించిన చివరి మహారాజు హరి సింగ్. డోగ్రా రాజ వంశానికి చెందినవాడు. జమ్మూను సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన డోగ్రా రాజ వంశంలో చివరి రాజు హరి సింగ్. జమ్మూలో 1947 వరకు స్వయంప్రతిపత్తి, అంతర్గత సార్వభౌమాధికారాన్ని అనుభవించింది. ఆయన హయాంలో కాశ్మీర్ భూతల స్వర్గంగా విలసిల్లింది. ఇప్పుడాయన జయంతిని జమ్మూ కాశ్మీర ప్రభుత్వం అధికార కార్యకలాపాల మధ్య అంతిమయాత్రను చేపట్టనుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక రాజ్‌పుత యువకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ డిమాండ్లు, ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ జమ్మూకు చెందినది మాత్రమే కాకుండా- దేశ ప్రజలందరి అభీష్టంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలు కొనసాగితే ప్రజల రోజువారీ జీవితాలకు ఆటంకం కలుగుతుందని, సరిహద్దు ప్రాంతమైన సున్నితమైన రీజియన్ జమ్ముకు శ్రేయస్కరం కాదని అన్నారు.












Click it and Unblock the Notifications