మోడీ సభ గ్రౌండ్‌లో, సమీపంలో వరుస బాంబు పేలుళ్లు
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం వరుస పేలుళ్లు సంభవించాయి. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పాట్నాలోని హూంకార్ ర్యాలీ సభలో ఈ రోజు పాల్గొన్నారు. ఈ సభకు ముందు పాట్నాలో వరుసగా ఎనిమిది నాటు బాంబులు పేలాయి.
మోడీ పాట్నాకు రాకముందు రెండు పేలుళ్లు సంభవించగా, రాజధానిలో అడుగు పెట్టిన తర్వాత ఆరు పెలుళ్లు సంభవించాయి. ఉదయం పదకొండు గంటలకు రైల్వే స్టేషన్‌లోని పదో నెంబరు ప్లాట్ ఫాం పైన, రెండోది సినిమా థియోటర్ సమీపంలో పన్నెండున్నర గంటలకు సంభవించింది.

అలాగే మోడీ సభ జరగాల్సిన గాంధీ మైదానంలో రెండు పేలుళ్లు, వెలుపల నాలుగు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుస పేలుళ్ల నేపథ్యంలో పోలీసులు మోడీ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, రేల్వే స్టేషన్ సమీపంలో రెండు బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. రైల్వే స్టేషన్‌లో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, మిగతా పేలుళ్లలో గాయపడ్డారు.
సభ జరిగి తీరుతుంది: బిజెపి
ఎవరు ఏం చేసినా మోడీ సభ జరిగి తీరుతుందని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మోడీ హూంకార్ ర్యాలీలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications