మెట్రో రైలుకూ అడ్డం పడ్డ ప్రబుద్ధుడు: తృటిలో తప్పిన ప్రమాదం
న్యూఢిల్లీ: సాధారణ రైళ్లకే అనుకుంటే.. మెట్రో రైలుకు కూడా అడ్డం పడ్డాడో ప్రబుద్ధుడు. కాకపోతే- తృటిలో ప్రాణాలతో బయటపడ గలిగాడు. మెట్రో స్టేషన్ సిబ్బంది చురుగ్గా వ్యవహరించి, అతణ్ని రైలు కింద పడకుండా పక్కకు లాగేశారు. దేశ రాజధానిలోని యమునా బ్యాంక్-వైశాలి సెక్షన్ పరిధిలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫలితంగా- బ్లూ లైన్ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. బ్లూ లైన్ మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అంటూ ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ వెల్లడించింది.
ఢిల్లీ నగర శివార్లకు ఆనుకుని ఉండే ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్ కౌశంబి స్టేషన్‌లో ఈ ఉదయం 9:50 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు డీఎంఆర్‌సీ పేర్కొంది. ఈ ఉదయం కౌశంబి స్టేషన్‌కు వచ్చిన గుర్తు తెలియని యువకుడొకడు.. రైలు బయలుదేరే సమయానికి అందులో నుంచి పట్టాల పైకి దూకేశాడు. ద్వారకా వైపునకు బయలుదేరడానికి కదిలిన సమయంలో అనూహ్యంగా ఆ యువకుడు పట్టాలపైకి దూకాడు.

మహిళల కోసం కేటాయించిన ర్యాక్, దాని వెనుక ర్యాక్ మధ్య స్థలంలో ఇరుక్కుపోయాడు. అతణ్ని గుర్తించిన వెంటనే- స్టేషన్ సిబ్బంది రైలును ఆపేశారు. ర్యాక్ ల మధ్య ఇరుక్కున్న అతణ్ని అతి కష్టం మీద బయటికి లాగారు. ఆ వెంటనే పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వల్ల బ్లూ లైన్ మార్గంలో రైళ్ల రాకపోకలు జాప్యం ఏర్పడినట్లు డీఎంఆర్‌సీ వెల్లడించింది.
Blue Line Update
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) May 15, 2019
Delay in services between Yamuna Bank and Vaishali due to a person on track at Kaushambi.












Click it and Unblock the Notifications