Shiv Sena: ఉద్ధవ్ థాక్రేకు భారీ షాక్: ఏక్‌నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన, స్పీకర్ కీలక ఉత్తర్వులు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామా చోటు చేసుకుంది. ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి భారీ షాక్ తగిలింది. అదే సమయంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన వర్గానికి ఊరట లభించింది. షిండే నేతృత్వంలోని 40 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ చెల్లదంటూ మహారాష్ట్ర స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేగాక, ఏక్ నాథ్ షిండే వర్గమే నిజమైన శిసేన అంటూ స్పీకర్ తేల్చి చెప్పారు. ఎన్నికల సంఘం కూడా ఇదే చెప్పిందని స్పీకర్ నర్వేకర్ స్పష్టం చేశారు. షిండే వర్గంలోనే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. కాగా, 2022లో శివసేన రెండు వర్గాలు విడిపోయిన విషయం తెలిసిందే. షిండే వర్గం బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఏక్‌నాథ్ షిండే సహా మొత్తం 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉద్ధవ్ థాక్రే వర్గం చేసిన అభ్యర్థనను తోసిపుచ్చారు. అనర్హత నోటీసులు జారీ చేసిన దాదాపు ఆరు నెలల తర్వాత బుధవారం ఈమేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్.
ఫలితంగా ఏక్‌నాథ్ షిండేకు పదవీ గండం తప్పింది. అనర్హత పిటిషన్పై తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ రాహుల్ నర్వేకర్. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్నే అసలైన శివసేన పార్టీగా గుర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ రాజ్యాంగానికి సంబంధించిన అనేక నిబంధనలను ఈ సందర్భంగా స్పీకర్ ప్రస్తావించారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 105 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 145 సీట్లు అవసరం. అజిత్ పవార్ సహాయంతో బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పినా 4 రోజులకే కుప్పకూలింది. ఆ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి 'మహా వికాస్ అఘాడీ' పేరుతో కూటమి ఏర్పాటు చేశాయి. ఫలితంగా విపక్ష కూటమిలోని శాసనసభ్యుల సంఖ్య 154కు చేరింది.
అప్పటి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరింది. అయితే, ఏక్ నాథ్ షిండే రూపంలో మహా వికాస్ అఘాడీకి పెద్ద షాక్ తగిలింది. శివసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. 30 మంది శాసనసభ్యులతో కలిసి పార్టీని వీడి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపారు ఏక్ నాథ్ షిండే. మహారాష్ట్ర సీఎం పదవి చేపట్టారు. ఆ తర్వాత షిండే వర్గంలోని శివసేన శాసనసభ్యుల సంఖ్య 40కి పెరిగింది. దీంతో అనర్హత వేటు వేయాలంటూ ఉద్ధవ్.. స్పీకర్, కోర్టులను ఆశ్రయించారు. ఈ క్రమంలో తాజాగా, స్పీకర్ తుది నిర్ణయం ప్రకటించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications