36 మందిని పొట్టనబెట్టుకున్న బస్సు ప్రమాదం: హాహాకారాలు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుమంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఫలితంగా మృతుల సంఖ్య మరిం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్య చికిత్సను అందిస్తోన్నారు.
జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలోని అస్సార్ సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. సుమారు 55 మంది ప్రయాణికులతో బటోటే నుంచి కిష్తవార్‌కు బయలుదేరిన బస్సు నంబర్ జేకే 02 సీఎన్ 6555 మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. బటోటే- కిష్తవార్ జాతీయ రహదారిపై ట్రుంగల్- అస్సార్ మధ్య అదుపు తప్పింది. సుమారు 300 అడుగుల లోతు ఉన్న లోయలో పడింది.

ఈ ఘటనలో తొలుత 19 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. క్రమంగా మృతుల సంఖ్య పెరుగుతూ వెళ్లింది. 36కు చేరుకుంది. గాయపడ్డ వారిలో మరో ఆరుమంది పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రత సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. లోయలోకి దిగడానికి ప్రత్యేక యంత్రాలను తీసుకొచ్చారు. వాటి సహాయంతో మృతదేహాలు, క్షతగాత్రులను బయటికి తీసుకుని రాగలిగారు. అంతపై నుంచి కిందపడటం వల్ల బస్సు నామరూపాల్లేకుండా పోయింది. మొత్తం నుజ్జునుజ్జు అయింది.
#WATCH | J&K | 36 people died and 19 people injured, including 6 critically injured, in a bus accident in Assar region of Doda. The injured have been shifted to hospital.
— ANI (@ANI) November 15, 2023
Visuals from the accident spot. pic.twitter.com/AwA2LzVfCC
ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. గాయపడ్డ వారికి 50 వేల రూపాయలను అందజేయనున్నట్లు చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications