వేసవి ప్రత్యేక రైళ్లకు ఏపీలో హాల్ట్ స్టేషన్లు

Special Trains: వేసవి సెలవుల్లో రైల్వేకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.

ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

Several special summer Trains to run from Bengaluru Hubballi to Banaras and Katihar

తాజాగా ఏపీ మీదుగా బెంగళూరు సర్ ఎం విశ్వేశ్వరాయ టెర్మినల్, హుబ్లీ నుంచి బనారస్, అస్సాంలోని నారెంగి మధ్య పలు ప్రత్యేక రైళ్లను నడువనున్నట్లు వెల్లడించారు. బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తోన్న నైరుతి రైల్వే అధికారులు వీటిని ప్రవేశపెట్టారు. హుబ్లీ- బనారస్, హుబ్లీ- కతిహార్, బెంగళూరు ఎస్ఎంవీటీ- నారెంగి మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

వచ్చే నెల 10వ తేదీ వరకు ప్రతి శనివారం హుబ్లీ నుంచి బయలుదేరే నంబర్ 07323 ప్రత్యేక రైలు రెండు రోజుల తరువాత బనారస్‌కు చేరుకుంటుంది. వచ్చేనెల 13వ తేదీ వరకు ప్రతి మంగళవారం బనారస్ నుంచి బయలుదేరే నంబర్ 0732 ప్రత్యేక రైలు హుబ్లీకి చేరుకుంటుంది.

హవేరి, రాణిబెన్నూర్, హరిహర్, దావణగెరె, చిక్కజాజూర్, కడూర్, అరసికెరె, తుంకూర్, యలహంక, ఏపీ, తెలంగాణల్లోన హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, బేగంపేట్, సికింద్రాబాద్, ఖాజీపేట్, జమ్మికుంట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, బల్లార్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, ఆమ్లా, బేతుల్, జబల్‌పూర్, కత్ని, సత్నా, ప్రయాగ్‌రాజ్ మీదుగా బనారస్ చేరుకుంటుంది.

ఈ నెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం హుబ్లీ నుంచి బయలుదేరే నంబర్ 07325 ప్రత్యేక రైలు రెండో రోజు సాయంత్రం కతిహార్‌కు చేరుకుంటుంది. ఈ నెల 12 నుంచి మే 5వ తేదీ వరకు ప్రతి శనివారం కతిహార్ నుంచి బయలుదేరే నంబర్ 07326 నంబర్ ప్రత్యేక రైలు హుబ్లీకి చేరుకుంటుంది.

గదగ్, కొప్పల్, హొస్పేట్, తోరణగల్లు, బల్లారి, గుంతకల్, డోన్, నంద్యాల, దిగువమెట్ట, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపూర్, ఖుర్దా రోడ్, కటక్, భువనేశ్వర్, భద్రక్, బాలేశ్వర్, ఖరగ్‌పూర్, బోల్‌పూర్, మల్దా మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

Take a Poll

ఈ నెల 29వ తేదీ వరకు ప్రతి మంగళవారం బెంగళూరు ఎస్ఎంవీటీ నుంచి బయలుదేరే నంబర్ 06559 ప్రత్యేక రైలు రెండు రోజుల తరువాత అస్సాంలోని నారెంగికి చేరుకుంటుంది. ఈ నెల 12వ తేదీ నుంచి మే 3 వరకు ప్రతి శనివారం నారెంగి నుంచి బయలుదేరే నంబర్ 06560 నంబర్ రైలు బెంగళూరుకు చేరుకుంటుంది.

కేఆర్ పురం, బంగారపేట్, జోలార్‌పట్టి, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలేశ్వర్, ఖరగ్‌పూర్, అండుల్, బర్ధమాన్, బోల్‌పూర్ శాంతినికేతన్, న్యూ ఫరక్కా, మాల్దా టౌన్, కిషన్ గంజ్, న్యూ జల్‌పాయ్ గురి, న్యూ కూచ్ బెహార్, కామాఖ్య, గువాహటి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+