నాలుగేళ్ల చిన్నారులపై స్కూల్ స్వీపర్ లైంగిక వేధింపులు.. పోలీసులపై రాళ్ళు, రైల్ రోకో!
కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన మర్చిపోకముందే మహారాష్ట్రలోని థానేలోని బద్లాపూర్ లో ఓ పాఠశాలలో ఇద్దరు నాలుగేళ్ల బాలికలపైన స్కూల్ స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 12,13వ తేదీలలో ఇద్దరు నాలుగేళ్ల వయసు ఉన్న బాలికలపైన పాఠశాలలోని బాలికల టాయిలెట్లో 23 ఏళ్ల పురుష క్లీనింగ్ చేసే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతనిపైన ఆగస్టు 16వ తేదీన బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
నర్సరీ బాలికలపై లైంగిక వేధింపులు.. రైల్ రోకో చేసిన స్థానికులు
అయితే మహారాష్ట్రలో థానేలో ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన భారీ నిరసనలకు దారి తీసింది. స్థానికులు బద్లాపూర్ రైల్వే స్టేషన్లో ముంబై రైలు మార్గాన్ని అడ్డుకున్నారు రైల్వే సేవలను నిలిపివేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానికులు రైల్వే స్టేషన్ ను ముట్టడించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోక్సో కేసు పెట్టడంలో పోలీసులు ఆలస్యం చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిందితుడు అరెస్ట్
ఆందోళనకారులు పోలీసులపై రాళ్ళు రువ్వుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక తాజా ఆందోళనలతో స్వీపింగ్ బాయ్ పైన కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటనపై పాఠశాల యాజమాన్యం స్పందించినప్పటికీ తల్లిదండ్రులలో ఆగ్రహ జ్వాలలు ఏమాత్రం చల్లారలేదు.
కేసు పెట్టటంలో జాప్యం చేసిన ఇన్స్పెక్టర్ సస్పెండ్
ఇక బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు చేసినప్పటికీ కేసు పెట్టడంలో ఆలస్యం చేసిన ఇన్స్పెక్టర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.. నర్సరీ బాలికల పైన, లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక లైంగిక వేధింపుల కేసులను విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశాలు జారీ చేశారు.
థానేలో ఇద్దరు నర్సరీ బాలికలపై లైంగిక వేధింపులు..!#Thane #Maharashtra #Badlapur #SexualAssault #Oneindiatelugu pic.twitter.com/kcoHK9qiZP
— oneindiatelugu (@oneindiatelugu) August 20, 2024
సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న మహా సీఎం
ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఇవ్వాలని తానే పోలీస్ కమిషనర్ ను ఆయన ఆదేశించారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే బాద్లాపూర్ లో జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని సంఘటన జరిగిన పాఠశాల పైన చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. మహారాష్ట్రలో నర్సరీ బాలికల పైన జరిగిన లైంగిక వేధింపులు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.












Click it and Unblock the Notifications