ఆర్యన్ ఖాన్ బెయిల్ తర్వాత సంతోషంతో ఏడ్చేసిన షారూక్ ఖాన్;కొడుకు కోసం తండ్రి వేదన చెప్పిన లాయర్ ముకుల్ రోహాత్గీ

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరైన తర్వాత, షారూఖ్ ఖాన్ కళ్ళలో ఆనందభాష్పాలు కనిపించాయని ఆర్యన్ ఖాన్ బెయిల్ కేసు వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, భారత మాజీ అటార్నీ జనరల్ చెప్పారు.

 ఆర్యన్ ఖాన్ జైల్లో .. గౌరీ ఖాన్ పుట్టిన రోజు, షారూక్ ఖాన్ దంపతుల పెళ్లి రోజు వేడుకలకు దూరం

ఆర్యన్ ఖాన్ జైల్లో .. గౌరీ ఖాన్ పుట్టిన రోజు, షారూక్ ఖాన్ దంపతుల పెళ్లి రోజు వేడుకలకు దూరం

బాంబే హైకోర్టు గురువారం ఆర్యన్‌తో పాటు ఇద్దరు సహ నిందితులు అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాలకు బెయిల్ మంజూరు చేసింది. గత బుధవారం ప్రత్యేక ఎన్‌డిపిఎస్ కోర్టు వారి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు కావడానికి ముందు ఆర్యన్ 25 రోజులు జైలులో ఉన్నాడు. ఆర్యన్ ఖాన్ ను జైలు నుండి బయటకు తీసుకు రావడం కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖాన్ చేయని ప్రయత్నాలు లేవు. ఆర్యన్ ఖాన్ జైలుకి వెళ్ళిన తర్వాత అక్టోబర్ 8వ తేదీన తల్లి గౌరీ ఖాన్ పుట్టినరోజు వచ్చింది. ఆ తర్వాత అక్టోబరు 25వ తేదీన షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ ల 30 వ పెళ్లి రోజు వచ్చింది.

ఆర్యన్ ఖాన్ జైలుకు వెళ్ళిన తర్వాత తీవ్ర ఆవేదనలో కుటుంబం

ఆర్యన్ ఖాన్ జైలుకు వెళ్ళిన తర్వాత తీవ్ర ఆవేదనలో కుటుంబం

కొడుకు జైల్లో ఉండటంతో రెండు వేడుకలను కుటుంబం జరుపుకోలేకపోయింది. ఆర్యన్ ఖాన్ జైలుకు వెళ్లినప్పటి నుండి తల్లి గౌరీ ఖాన్ ఆర్యన్ ఖాన్ కోసం తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారని, సరిగా భోజనం కూడా చేయడం లేదని, నిత్యం భగవంతుని మీద భారం వేసి దేవుడి ప్రార్ధనలతో గడిపేస్తున్నారు అని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరిగింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పై బయటకు వస్తాడా లేదా అని షారుక్ ఖాన్ కుటుంబంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఎట్టకేలకు 25 రోజుల తర్వాత షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు.

టెన్షన్ లో ఆర్యన్ ఖాన్ .. సరిగా భోజనం కూడా చెయ్యలేదట

టెన్షన్ లో ఆర్యన్ ఖాన్ .. సరిగా భోజనం కూడా చెయ్యలేదట

షారుఖ్ గురించి రోహత్గీ మాట్లాడుతూ, కొడుకు బెయిల్ విషయంలో గత మూడు-నాలుగు రోజులుగా చాలా చాలా ఆందోళన చెందాడని, షారుక్ ఖాన్ సరైన భోజనం చేశాడో లేదో కూడా తెలియదని పేర్కొన్నారు. కాఫీ తర్వాత కాఫీ తాగుతూ తీవ్ర ఆందోళన చెందాడని వెల్లడించారు. తాను చివరిసారిగా షారుక్ ఖాన్ ను కలిసినపుడు అతని ముఖంలో ఒక పెద్ద ఉపశమనాన్ని చూడగలిగానని వ్యాఖ్యానించారు. షారుక్ ఖాన్ తన వృత్తిపరమైన కార్యకలాపాలను అన్నింటిని విడిచిపెట్టి కొడుకు కోసం తీవ్ర మనోవేదన చెందారని ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. దేవుడు ఉన్నాడని, ఆర్యన్ కు బెయిల్ లభించిన నేపధ్యంలో షారూక్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లానీ వ్యాఖ్యానించారు.

బెయిల్ మంజూరు తర్వాత లాయర్లతో కలిసి నవ్వుతూ షారూక్ ఖాన్ ఫోటోలు

బెయిల్ మంజూరు తర్వాత లాయర్లతో కలిసి నవ్వుతూ షారూక్ ఖాన్ ఫోటోలు


ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు అయిన తరువాత షారూఖ్ గతంలోతన లాయర్ల బృందంతో కలిసి నవ్వుతూ ఫోటోలలో కనిపించారు. సల్మాన్ ఖాన్, సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్ నుండి షారుఖ్ ఖాన్‌కు అభినందన కాల్స్ వచ్చాయి. గౌరీ తన స్నేహితులైన మహీప్ కపూర్ మరియు సీమా ఖాన్‌లతో ఫోన్‌లో మాట్లాడుతూ ఏడ్చేశారు. బెయిల్‌కు సంబంధించి సమాచార రాగానే గౌరీఖాన్ తీవ్రంగా రోదించినట్లు సమాచారం. ఇక శుక్రవారం నాడు ఆర్యన్ ఖాన్ ను జైలు నుండి బయటకు తీసుకురావటానికి లాయర్ల బృందం ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుంది. నేడు ఆర్యన్ ఖాన్ బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+