ఆర్యన్ ఖాన్ ను కలవటానికి జైలుకు వెళ్ళిన షారుక్ ఖాన్ ; జైల్లో ఆర్యన్ ఖాన్ పరిస్థితి ఇలా !!
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ కేసులో అక్టోబర్ 2వ తేదీన అరెస్టు కాగా, అప్పటినుండి ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 8 నుండి జైలులో ఉన్న కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను బెయిల్ పై బయటకు తీసుకురావాలని షారుక్ ఖాన్ చేయని ప్రయత్నాలు లేవు. మూడు సార్లు కొడుకు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు షారుక్ ఖాన్.

జైల్లో ఉంటున్న ఆర్యన్ ఖాన్ తీవ్ర మనస్థాపం
బుధవారం నాడు ఎన్డిపిఎస్ స్పెషల్ కోర్టు మూడోసారి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ ను కలవడానికి షారూఖ్ ఖాన్ జైలుకు వెళ్లారు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత ఆర్యన్ ఖాన్ ని కలవడానికి షారుక్ ఖాన్ వెళ్లడం ఇదే మొదటిసారి. ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుండి ఒత్తిడిని ఎదుర్కొంటూ, జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్‌ని కలవడానికి ఆర్థర్ రోడ్ జైలుకు చేరుకున్న షారూఖ్ ఖాన్ కు అభిమానులు సంఘీభావం తెలుపుతున్నారు. గత కొద్ది రోజులుగా జైల్లో ఉంటున్న ఆర్యన్ ఖాన్ తీవ్ర మనస్థాపంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
100 మందితో కలిసి ఒకే బ్యారక్ లో ..జైల్లో ఆర్యన్ ఖాన్
జైలు ఖైదీలతో కలిసి ఒకే బ్యారక్ లో ఆర్యన్ ఖాన్ ఉంటున్నట్టు, జైలు నుండి ఆర్యన్ ఖాన్ ఉన్న బ్యారక్ నుండి సోమవారం విడుదలైన శ్రవణ్ నాడార్ అనే వ్యక్తి ఆర్యన్ ఖాన్ ప్రవర్తన గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.100 మంది ఖైదీలు ఉన్న బ్యారక్ లో ఆర్యన్ ఖాన్ వాళ్లతో కలిసి ఉంటున్నట్టు వెల్లడించారు. కేవలం పది ఫ్యాన్లు, నాలుగు టాయిలెట్స్ మాత్రమే ఉండే ఆ గదిలో ఉంటున్నారని చెప్పాడు. జైలు ఆహారాన్ని తీసుకోవడం లేదని, కేవలం బిస్కెట్లు, చిప్స్ మాత్రమే తింటున్నాడు అని, జైలు అధికారులు ఇచ్చిన ఆహారాన్ని ఇతర ఖైదీలకు ఇస్తున్నాడని వెల్లడించారు.
ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారించాలని బొంబాయి హైకోర్టులో పిటీషన్
ఎవరు ఎంత చెప్పినా ఆకలిగా లేదని చెప్పేవాడిని, ఆహారం తీసుకోవడం లేదని తెలిపారు. ఇతర ఖైదీలలానే ఆర్యన్ ఖాన్ కూడా జైల్లో సాధారణ జీవితం గడుపుతున్నారని, ఎప్పుడూ దిగులుగా ఉంటున్నాడని పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ న్యాయవాదులు ముంబై డ్రగ్స్ కేసులో బెయిల్ పిటిషన్‌ను అత్యవసర ప్రాతిపదికన విచారించాలని గురువారం నాడు బొంబాయి హైకోర్టును ఆశ్రయించనున్నారు. ప్రత్యేక నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్‌డిపిఎస్) కోర్టు 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన నేపథ్యంలో బొంబాయి హైకోర్టును ఆశ్రయించనున్నారు .
త్వరలో కోర్టులకు దీపావళి సెలవులు.. బెయిల్ పరేషాన్ లో షారుక్ ఖాన్ కుటుంబం
నవంబర్ 4 వ తేదీన దీపావళి కావడంతో నవంబర్ మొదటి వారంలో కోర్టులకు సెలవులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ మొదటి వారానికి ముందు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రాకపోతే, అతని జైలు జీవితం మరింత పొడిగించబడుతుంది. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న షారుక్ ఖాన్ కొడుకు బెయిల్ విషయంలో తీవ్ర ఆవేదనతో ఉన్నారు. దీపావళికి అయినా ఆర్యన్ ఖాన్ బయటకు వస్తారా లేదా అన్నది ప్రస్తుతం అందరి ముందు ఉన్న ప్రధానమైన ప్రశ్న.












Click it and Unblock the Notifications