సోదరుడే ఉగ్రవాది, మట్టుబెట్టిన బీఎస్ఎఫ్: భారత్‌పై అఫ్రిది అక్కసు అప్పట్నుంచే!
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంతత లేదని, అమాయకులను చంపేస్తున్నారని మొసలకన్నీరుకార్చిన పాకిస్థాన్ క్రికెట్ షాహిద్ అఫ్రిదికి సంబంధించిన అసలు అక్కసు ఏమిటో తెలిసిపోయింది. గతంలో పాకిస్థాన్ నుంచి జమ్మూకాశ్మీర్‌లోకి చొరబడి మన సైన్యం చేతిలో హతమైన ఓ ఉగ్రవాది.. అఫ్రిదికి సమీప బంధువని తేలింది.
అఫ్రిదికి కజిన్(సోదరుడు) అయిన సకిబ్ అనే ఉగ్రవాదిని 2003లో బీఎస్ఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హర్కత్ ఉల్ అన్సర్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదే ఈ సకిబ్. పాకిస్థాన్‌లోని పెషావర్ నుంచి మనదేశంలోని కాశ్మీర్‌లోకి అక్రమంగా చొరబడ్డాడు.

రెండేళ్లపాటు అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించిన సకిబ్.. స్థానికులతో మాట్లాడేటప్పుడు తనకు అఫ్రిదితో ఉన్న బంధుత్వం గురించి గొప్పగా చెప్పుకునేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలోనే అఫ్రిది మంగళవారం కాశ్మీర్‌లో ప్రశాంతత లేదని, ఐక్యరాజ్యసమితి ఏం చేస్తోందంటూ మొసలి కన్నీరు కార్చాడు.
మనదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్‌ను భారతదేశం ఆక్రమించుకుందంటూ పిచ్చి ప్రేలాపనలు చేశాడు. కాగా, అఫ్రిది వ్యాఖ్యలపై భారత క్రికెటర్లు గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీలు ఇప్పటికే ఘాటుగా స్పందించారు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ కూడా అఫ్రిదీకి ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications