శక్తి మిల్స్ రేప్ కేసులో ఇద్దరు మైనర్లు దోషులు
ముంబై: ముంబైలోని శక్తి మిల్స్ సముదాయంలో నిరుడు జరిగిన రెండు అత్యాచారం కేసుల్లో ఇద్దరు మైనర్లను జువెనైల్ జస్టిస్ బోర్డు దోషులుగా గుర్తించింది. ముంబైలోని శక్తి మిల్స్ కాంప్లెక్స్‌లో నిరుడు ఓ టెలిఫోన్ ఆపరేటర్, ఓ ఫొటో జర్నలిస్టు సామూహిక అత్యాచారాలకు గురయ్యారు.
ఈ కేసుల్లో ముగ్గురు నిందితులకు కోర్టు ఈ ఏడాది ఆరంభంలో మరణశిక్ష విధించింది. విజయ్ జాదవ్ (18), ఖాసీం హఫీజ్ షేక్ అలియాస్ ఖాసిమ్ బెంగాలీ (20), సలీం అన్సారీ (27)లకు ముంబై కోర్టు మరణశిక్ష విధించింది.

నిరుడు జులై 31వ తేదీన 18 ఏళ్ల టెలిఫోన్ ఆపరేటర్‌పై, ఆగస్టు 22వ తేదీన 23 ఏళ్ల ఫొటో జర్నలిస్టుపై శక్తి మిల్స్ సముదాయాల్లో సామూహిక అత్యాచారాలు జరిగాయి. ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసన పెల్లుబుకింది.
ఈ కేసులో దోషులుగా తేలిన ఇద్దరు మైనర్లను నాసిక్‌లోని బోర్‌స్టల్ స్కూల్‌కు పంపిస్తారు. మూడేళ్ల పాటు వారు అక్కడ ఉంటారు. ఈ విషయాన్ని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖం చెప్పారు.












Click it and Unblock the Notifications