ఇది పెద్ద ఫ్రాడ్ భయ్యా.. కావాలంటే ఈ వీడియో చూడండి
Shambhavi Chaudhary: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి తెల్లవారు జాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. ఇక చివరిదైన రెండో విడత పోలింగ్ ఈ నెల 11వ జరుగనుంది. దీని తర్వాత 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
ఈ ఎన్నికల నేపథ్యంలో, లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కు చెందిన సమస్తిపూర్ లోక్‌సభ సభ్యురాలు శాంభవి చౌదరి వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. బీహార అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందనడానికి ఆమె పెద్ద ఉదాహరణగా నిలిచారు. తాను ఓటు వేసినట్లు మీడియా ముందు ఇంక్ మార్క్ ను చూపించే క్రమంగా రెండు వేళ్లను చూపించారామె. ఆ సమయంలో ఆమె తన తండ్రి, బీహార్ మంత్రి అశోక్ చౌదరి, తల్లి నీతాచౌదరి ఆమె పక్కనే ఉన్నారు. వారందరూ ఒక చేతి వేలిని మాత్రమే చూపగా.. శాంభవి చౌదరి రెండు వేళ్లనూ ప్రదర్శించారు.

తొలుత కుడిచేతి వేలిని చూపించారు. ఆ తర్వాత దాన్ని కిందికి దించి.. ఎడమ చేతి చూపుడు వేలిని చూపారు. రెండు చేతి వేళ్లకూ ఇంక్ మార్క్ ఉండటం స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె రెండుసార్లు ఓటు వేశారనడానికి ఇది ఉదాహరణ అంటూ ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి చెబుతోంది. శాంభవి చౌదరి రెండు చేతి వేళ్ళకూ ఓటు వేసిన ఇంకు గుర్తులు ఉన్నాయని, ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తోంది. శాంభవి చౌదరి రెండు చేతులతో ఓట్లను దొంగిలించారని విమర్శించింది.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పాట్నా జిల్లా ఎన్నికల అధికారులు వివరణ ఇచ్చారు. శాంభవి చౌదరి ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు వేశారని, పొరపాటున ఆమె రెండు చేతులకు ఇంకు వేశారని స్పష్టం చేశారు. బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బుద్ధా కాలనీలో గల సెయింట్ పాల్స్ ప్రైమరీ స్కూల్ లో ఏర్పాటు చేసిన 61వ పోలింగ్ బూత్ అధికారిని సంప్రదించామని, పోలింగ్ సిబ్బంది పొరపాటున శాంభవి కుడి చేతికి ఇంక్ వేశారని, ఆ తర్వాత ఎడమ చేతి వేలికి రాశారని అని తెలిపారు.
She is Shambhavi Chaudhary, daughter of JDU leader Ashok Chaudhary & MP from Chirag Paswan’s LJP
— Veena Jain (@Vtxt21) November 7, 2025
Yesterday, after voting in Bihar, she was posing for the camera & she had ink on both hands
Did she vote twice? Just look at her expressions after being exposed! 🧐 pic.twitter.com/hsuqLwdKoH
ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఎన్నికల్లో చోటు చేసుకుంటోన్న అక్రమాలకు ఆధారమని చెబుతున్నారు. ఓట్ చోరీ వ్యవహారం మీడియా ముందు అనుకోకుండా బయటపడిందని కామెంట్స్ పెడుతున్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ అనేది ఓ జోక్ గా మారిందని, దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ నైతిక బాధ్యత వహించాలని సూచిస్తోన్నారు. ఎంపీగా ఉంటూ దొంగఓటు వేసిందంటూ ఆర్జేడీ- కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తోన్నారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications