Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఫ్లైట్ నడిపిన మహిళా పైలెట్- ఎంతో అనుభవం ఉన్నా.. చివరి నిమిషంలో !!

మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కన్నుమూశారు. జిల్లా పరిషత్, పంచాయితీ సమితి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆయన బారామతికి చేరుకున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఒక అటెండెంట్, ఇద్దరు పైలట్లు శాంభవీ పాఠక్, సుమిత్ కపూర్ మరణించారు. విమానంలోని అయిదుమందిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.

ఈ విమానాన్ని అనుభవజ్ఞురాలైన కెప్టెన్ శంభవి పాఠక్ నడిపారు. పైలట్ కావాలనే లక్ష్యంతో శంభవి పాఠక్ ముంబై విశ్వవిద్యాలయంలో ఏరోనాటిక్స్, ఏవియేషన్ సైన్స్‌లో బీఎస్సీ పూర్తిచేశారు. అనంతరం న్యూజిలాండ్‌లోని అంతర్జాతీయ కమర్షియల్ పైలట్ అకాడమీలో 2018-2019 మధ్య శిక్షణ పొందారు. అక్కడ న్యూజిలాండ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నుండి కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందారు. ఆమె తండ్రి ఆర్మీ అధికారి.

Shambhavi Pathak and Sumit Kapoor Captains Behind the Tragedy as Ajit Pawar jet crash fallen heroes

స్వదేశానికి వచ్చాక డీజీసీఏ కమర్షియల్ పైలట్ లైసెన్స్, ఎయిర్‌లైన్ పైలట్‌కు కీలకమైన 'ఫ్రోజన్ ఏటీపీఎల్'ను పూర్తిచేశారు శాంభవీ పాఠక్. ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ రేటింగ్‌తో ఆమె అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్‌గా కొత్త పైలట్‌లకు శిక్షణ ఇచ్చే నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. స్పైస్‌జెట్ నుండి ఏవియేషన్ సెక్యూరిటీ శిక్షణను పొందారు. ఏ320 జెట్ ఓరియంటేషన్ లో నిష్ణాతురాలిగా ఎదిగారు. 2022 ఆగస్టు నుండి వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఫస్ట్ ఆఫీసర్‌గా ఆమె వీఐపీలు, పారిశ్రామికవేత్తలు ఉపయోగించే హై పెర్ఫార్మెన్స్ బిజినెస్ జెట్ లీర్‌జెట్-45ను నడుపుతున్నారు.

ఏవియేషన్ రంగంలో బిజినెస్ జెట్‌ల ఫస్ట్ ఆఫీసర్‌ల జీతం అనుభవం, సంస్థను బట్టి మారుతుంటుంది. లీర్‌జెట్ వంటి జెట్‌లలో పనిచేసేవారికి నెలకు దాదాపు మూడు లక్షల నుండి 4.50 లక్షల రూపాయల వరకు జీతం లభిస్తుందని ఏవియేషన్ వర్గాలు వెల్లడించాయి. ఆమె జీతం కూడా అంతే ఉంటుందని తెలిపాయి. శాంభవీ పాఠక్ తో పాటు కోపైలెట్, కెప్టెన్ సుమిత్ కపూర్ కూడా కన్నుమూశారు. విమానం నడపడంలో వీరికి మంచి అనుభవం ఉంది.

సుమిత్ కపూర్‌ 16,000 గంటలు, శాంభవీ పాఠక్‌కు సుమారు 1,500 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. కెప్టెన్ సుమిత్ కపూర్ గతంలో సహారా, జెట్‌లైన్, జెట్ ఎయిర్‌వేస్‌లలో పనిచేశాడు. అనంతరం వీఎస్ఆర్ లో చేరారు. లీర్‌జెట్ 45 విమానాల నిర్వహణలో నిష్ణాతుడు. వీరి మరణం పట్ల వీఎస్ఆర్ సంస్థ సంతాపం తెలిపింది. సుమిత్ కపూర్ తనకు అత్యంత ఆత్మీయుడని, ఆయన కుమారుడు కూడా తమ వద్దే పైలట్‌గా పనిచేస్తున్నాడని పేర్కొంది. శాంభవి తనకు కన్నబిడ్డలాంటిదని ఛైర్మన్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+