కర్ణాటక వ్యక్తికి రూ. 49 కోట్ల జాక్ పాట్.. ఒక్క రాత్రిలో సీన్ రివర్స్..

కర్ణాటక వాసిని అదృష్టం వరించింది. అబుదాబి వేదికగా జరిగే బిగ్ టికెట్ లాటరీలో ఉడిపి జిల్లాలకు చెందిన 33 ఏళ్ల శాంతను షెట్టిగార్ కు బంపర్ ఆఫర్ వచ్చింది. లక్కీ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్ లు గెలుచుకున్నాడు. భారతీయ కరెన్సీలో దీని విలువ దీని విలువ సుమారు రూ. 49 కోట్లు.. ఈ విషయం తెలియడంతో కర్ణాటకలోని అతని సొంత గ్రామంలో సెలబ్రేషన్లు స్టార్ట్ అయ్యాయి.

కర్ణాటకకు చెందిన ప్రవాస భారతీయుడు శాంతను షెట్టిగార్ అబుదాబిలోని బిగ్ టికెట్ రాఫెల్ డ్రాలో ధ20 మిలియన్లు (సుమారు రూ. 49 కోట్లు) గెలుచుకున్నారు. ఈ భారీ విజయంతో ఆయన స్వస్థలమైన ఉడిపిలో సంబరాలు మొదలయ్యాయి. మంగళవారం ఆన్‌ లైన్‌ లో ఈ లాటరీ ఫలితాలు వెల్లడయ్యాయి.

ఉడిపి జిల్లాలోని ఉద్యవర్‌కు చెందిన 33 ఏళ్ల షంతను షెట్టిగర్.. ఈ వారం అబుదాబిలో జరిగిన లైవ్ డ్రాలో జాక్‌ పాట్‌ ను దక్కించుకున్నారు. సిరీస్ 283, టికెట్ నంబర్ 305810తో కూడిన విజేత ఎంట్రీని టెలివిజన్ రాఫెల్ ఈవెంట్‌ లో ప్రకటించారు.

ప్రస్తుతం ఒమన్‌లోని మస్కట్‌లో రిటైల్ రంగంలో పనిచేస్తున్న షెట్టిగర్, ఈ విజేత టికెట్‌ను ఒక స్నేహితుడితో కలిసి కొనుగోలు చేశారని నిర్వాహకులు తెలిపారు. గల్ఫ్ ప్రాంతం నుండే కాకుండా అనేక దేశాల నుండి పాల్గొనే వారిని ఆకర్షించే ప్రసిద్ధ నెలవారీ డ్రా ఇది.

బహుమతి ప్రకటించాక నిర్వాహకులతో మాట్లాడిన షెట్టిగర్, ఈ అనుకోని విజయం పట్ల ఆశ్చర్యం, సంతోషం వ్యక్తం చేశారు. ప్రణాళిక ప్రకారం గెలుచుకున్న మొత్తాన్ని తన టికెట్ భాగస్వామితో పంచుకుంటానని తెలిపారు. విజయావకాశాలను పెంచుకునేందుకు ఇలా ఉమ్మడి టికెట్లు కొనుగోలు చేయడం సహజం.

shantanushettygar From Karnataka to Crorepati Shantanu Shettygar Bags 49 Crore in Big Ticket Raffle

ఈ విషయం ఉడిపి చేరుకోగానే, స్నేహితులు, బంధువులు ఇది సమాజానికి గర్వకారణమని అన్నారు. షెట్టిగర్ విదేశాల్లో ఉన్నా తన స్వస్థలంతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారని స్థానికులు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో భారతీయ ప్రవాసులు సాధించిన పలు జాక్‌ పాట్ విజయాల జాబితాలో ఈ విజయం కూడా చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+