శరద్ పవార్ ఎన్సీపీకి కొత్త పేరు
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తీసుకున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి దక్కుతుందనే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ తేల్చేసిన తరువాత.. అక్కడి పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. అక్కడి రాజకీయాల్లో మరో వర్గం ఆవిర్భవించినట్టయింది.
చీలిక వర్గ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేతికి ఎన్సీపీ, దాని ఎన్నికల గుర్తు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారమే రూలింగ్ ఈసీ రూలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్సీపీకి అసలైన నేతగా అజిత్ పవారేనని నిర్ధారించింది.

ఎన్సీపీ, దాని ఎన్నికల గుర్తు ఎవరికి దక్కాలనే విషయంపై ఆరు నెలలుగా కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు సాగిస్తూ వచ్చింది. న్యాయ నిపుణులతో పలుమార్లు భేటీ అయింది. అనంతరం ఎన్సీపీ ఎన్నికల గుర్తు వివాదాన్ని పరిష్కరించింది. అజిత్ పవార్ నేతృత్వంలోని చీలిక వర్గానికి అనుకూలంగా రూల్ జారీ చేసింది.
పార్టీ రాజ్యాంగం, దానికి ఉన్న శాసన సభ్యుల సంఖ్యాబలం, సంస్థాగతంగా రూపొందించుకున్న మార్గదర్శకాలు.. వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నట్లు ఈసీ వివరించింది. సంస్థాగతంగా మెజారిటీని కలిగి ఉన్న వారి వాదనకు మద్దతుగా శరద్ పవార్ వర్గం వేసిన పిటీషన్లను పరిశీలించినట్లు తెలిపింది.
ఎన్సీపీ నుంచి బయటికి వచ్చిన అజిత్ పవార్.. తనకు మద్దతు ఇస్తోన్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికిన విషయం తెలిసిందే. అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా అపాయింట్ అయ్యారు. ఎన్సీపీని, దాని గుర్తు తనకే దక్కుతుందంటూ ఈసీకి తెలియజేశారు. దీనిపై విచారణల అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
దీని తరువాత శరద్ పవార్ వర్గం మరో ముందడుగు వేసింది. తమ వర్గానికి దక్కిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కొత్త పేరు పెట్టింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- శరద్‌చంద్ర పవార్‌గా నామకరణం చేసింది. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.












Click it and Unblock the Notifications