శర‌ద్‌పవార్ సంచలన నిర్ణయం..అతనికే టికెట్

శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అసెంబ్లీ ఎన్నికలకు ఏడుగురు అభ్యర్థులతో కూడిన నాల్గవ జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్‌కు టిక్కెట్ కేటాయించడం జరిగింది. కటోల్ నియోజకవర్గం నుంచి సలీల్ దేశ్‌ముఖ్‌ పోటీ చేయనున్నారు. కొత్త జాబితాతో కలిపి ఇప్పటివరకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 83 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పడబోయేది మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని, బీజేపీ ఉద్దవ్ సర్కార్‌ను కూల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని శరద్ పవార్ విమర్శించారు. మహారాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందే సంక్షేమ పథకాలను ప్రకటించడం ద్వారా బీజేపీ కూటమి సర్కారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని శరద్ పవార్ తెలిపారు. పొత్తులో భాగంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (UBT),కాంగ్రెస్‌ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఎన్సీపీ 83 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ 99,శివసేన (UBT)85 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇండియా కూటమి ఇంకా 21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.2019లో జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఏ పార్టీకి అండగా నిలవలేదు.

sharad pawar ncp releases list of candidates

దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ 105 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించగా, శివసేన పార్టీ -56 , ఎన్సీపీ - 54, కాంగ్రెస్ పార్టీ - 44 సీట్లు సాధించాయి. అధికారం కోసం శివసేన ,ఎన్సీపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఉద్ధవ్ థాకరేను ఉమ్మడి సీఎంగా ఎంపిక చేశారు. అయితే కొద్ది కాలానికే మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. శివసేన మరియు ఎన్సీపీ పార్టీల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి. శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే ,ఎన్‌సీపీ అజిత్‌ పవార్‌.. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీతో చేతులు కలిపారు. దీంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏ కూటమికి పట్ట కడతారో అని దేశమంతా అతృతుగా ఎదురు చూస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనుండగా, మొత్తం 288 నియోజకవర్గాలకు నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+