మోదీ, ఇందిరా గాంధీ.. బోత్ ఆర్ నాట్ సేమ్.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1971 లో కాంగ్రెస్ హయాంలో పాకిస్థాన్ తో యుద్ధం, 2025లో పాకిస్థాన్ తో యుద్ధం రెండూ ఒకటి కాదని అభిప్రాయపడ్డారు. 1971లో పాకిస్థాన్ పై భారత్ తిరుగలేని విజయాన్ని చూసిందని ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వ లక్షణంతోనే భారత్.. పాక్ ను ఓడించిందని అన్నారు. ఇందిరా గాంధీ భారత చిత్ర పటాన్ని తిరగ రాశారని బంగ్లాదేశ్ కు పాకిస్థాన్ నుంచి విముక్తిని ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారని అన్నారు.

1971లో భారత సైనికుల ధాటికి తట్టుకోలేక పాకిస్థాన్.. బంగ్లాదేశ్ కు విముక్తిని ఇచ్చింది. ఇరు దేశాల మధ్య అప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే తాజాగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు సంఘటనలు పోల్చుతూ సామాజిక మాధ్యమాల్లో ట్వీట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తనదైన శైలిలో బదులిచ్చారు.

Shashi Tharoor Comments on India-Pakistan Ceasefire Urges Strategic Clarity

" 1971, 2025 ఈ రెండు పరిణామాలు వేరు. అప్పట్లో భారత్ విజయం ఓ సంచలనం. ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వ పటిమతో భారత్ గెలిచింది. భారత ప్రజలు ఇప్పుడు శాంతిని కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి యుద్ధానికి దారి తీస్తోంది. 1971లో బంగ్లాదేశ్ ను పాకిస్థాన్ చెర నుంచి విముక్తి చేయడానికి యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అది అవసరం లేదు. మనం ఇప్పటికే చాలా కోల్పోయాం. మనం ఏం కోల్పోయామే కాశ్మీర్ ప్రజలను అడగండి. యుద్ధం అవసరం ఉంటే చేయాలి. నేను దానికి సమర్థిస్తాను. కానీ ఇప్పుడు టెర్రరిస్టులకు బుద్ధి చెప్పడం ముఖ్యం. అది చేశాం. 1971 నాటి పరిస్థితి ఇప్పడు భారత్ లో లేదు. యుద్ధం అవసరం లేదు. అప్పుడున్న దయనీయ పరిస్థితిలో ఇప్పుడు పాకిస్థాన్ లేదు. పాకిస్థాన్ వద్ద కూడా అధునాతన ఆయుధాలు ఉన్నాయి. వాళ్లు ఎంతకైనా తెగిస్తారు" అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తెలిపారు.

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులను వెతికి చంపాలని.. ఎన్ని సంవత్సరాలైనా వాళ్లను వదిలే ప్రసక్తే లేదని శశి థరూర్ పేర్కొన్నారు. అమాయక ప్రజలను చంపే అధికారం ఎవరికీ లేదన్నారు. మరోవైపు భారత్.. అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడంపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. మరోసారి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. ఏ నిర్ణయమైనా దేశంలోని అన్ని పార్టీలతో చర్చించి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+