షాక్:శశికళ ప్రమాణస్వీకారం రద్దు,గవర్నర్ చెన్నైటూర్ రద్దు
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం ఈ నెల 7వ, తేది ఉండకపోవచ్చని తెలుస్తోంది. తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఢిల్లీలోనే ఉన్నారు.ఆయన చెన్నైకు ఎప్పుడు వెళ్తారో తెలియదని చెన్నై లోని రాజ్ భవన
చెన్నై:తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం ఈ నెల 7వ, తేదిన ఉండకపోవచ్చని తెలుస్తోంది. తమిళనాడు ఇన్ చార్జి గవర్నర్ చెన్నై పర్యటన
రద్దుచేసుకొన్నారని సమాచారం అందుతోంది.శశికళపై ఉన్న కేసుల విషయమై తీర్పు వరకు వేచి చూసే ధోరణిలో గవర్నర్ ఉన్నారు.అయితే ఈ నెల7వ, తేదిన
శశికళ ప్రమాణస్వీకారం ఉంటుందని అన్నాడిఎంకె పార్టీ నాయకులు చెబుతున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం ఈ నెల 7వ, తేదిన చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు గవర్నర్ కు సమాచారం కూడ
ఇచ్చారు.తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
అయితే శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కోసం అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు.అయితే కోర్టు తీర్పు వచ్చేవరకు ప్రమాణస్వీకారం వేచిచూసే ధోరణితో ఉండాలని
గవర్నర్ యోచిస్తున్నారు. అయితే ఈ విషయమై గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్రప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.శశికళపై ఉన్న కేసులపై వారం రోజుల్లో తీర్పువచ్చే అవకాశం ఉంది. దీనిపై న్యాయపరమైన సలహను గవర్నర్ తీసుకొంటున్నారని సమాచారం.
సోమవారం రాత్రి వరకు గవర్నర్ విద్యాసాగర్ రావు ఢిల్లీలోనే ఉన్నారు.అయితే ముఖ్యమంత్రిగా శశికళను ప్రమాణస్వీకారం చేయించాలంటే గవర్నర్ చెన్నైకు వెళ్ళాల్సిందే.అయితే చెన్నైలోని రాజ్ భవన్ వర్గాలు మాత్రం గవర్నర్ చెన్నై పర్యటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు.
అయితే మంగళవారం నాడు శశికళ ప్రమాణస్వీకారం ఉంటుందని అన్నాడిఎంకె పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.అయితే కోర్టు తీర్పు శశికళకు వ్యతిరేకంగా వస్తే మరోసారి కొత్త ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంటుంది.దీంతో గవర్నర్ వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నారని సమాచారం.అయితే ఈ నెల 7వ, తేదిన శశికళ ప్రమాణస్వీకారం ఖచ్చితంగా ఉంటుందని అన్నాడిఎంకె పార్టీ అధికార ప్రతినిధులు చెబుతున్నారు.
మరో వైపు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారాన్ని చేయకూడదంటూ ఓ స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతే కాదు మంగళవారం నాడు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications