బీజేపీని ఓడించండి: రెబల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా షాకింగ్ కామెంట్స్
ముజఫర్‌నగర్: భారతీయ జనతా పార్టీ రెబల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి సొంత పార్టీకి షాకిచ్చారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలని సూచించారు. అంతేగాక, సొంత పార్టీ బీజేపీని ఓడించాలంటూ పిలుపునిచ్చారు.
'భారత ప్రభుత్వ ఇష్ట ప్రకారమే రిలయన్స్‌ను డసో.. తమ స్థానిక భాగస్వామిగా ఎంచుకుందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండే చెప్పినట్లు ఆ దేశ మీడియా ఇటీవల పేర్కొంది. యుద్ధ విమానాలను తయారు చేయడంలో చాలా అనుభవం ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) వంటి దేశీయ సంస్థను పక్కకు పెట్టి, డిఫెన్స్‌లో కొత్తదైన సంస్థను ఇందులో ఎందుకు భాగస్వామిని చేశారు?' అని సిన్హా ప్రశ్నించారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని శత్రుఘ్న సిన్హా ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. '2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతలంతా ఏకమై బీజేపీని ఓడించాలి' అని ఆయన వ్యాఖ్యానించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శత్రుఘ్న సిన్హా కూడా ఈ వివాదంపై ఆరోపణలు చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications