ధిక్కార స్వర ఫలితం : శత్రుఘ్నసిన్హాకు దక్కని టికెట్, పాట్నాసాహిబ్ నుంచి రవిశంకర్ ప్రసాద
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపట్టిన బీజేపీ నేత శత్రుఘ్నసిన్హా ఆ పార్టీ మొండిచూయి చూపించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదు. 2014లో బీహార్‌లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు. ఈసారి శత్రుఘ్న సిన్హా స్థానంలో బీజేపీ .. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు టికెట్ కేటాయించింది.
మూడో విడత జాబితాలో మొండిచేయి
బీజేపీ మూడోవిడత జాబితాను ఇవాళ విడుదల చేసింది. ఇందులో బీహార్‌కు 39 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కానీ అందులో శత్రుఘ్న సిన్హా పేరును లేదు. ఇక్కడినుంచే శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది.
క్యాబినెట్ నుంచి తప్పించడంతో విమర్శలు
2014లో మోదీ సర్కార్ కొలువుదీరాక .. శత్రుఘ్న సిన్హాకు పోర్టు పోలియా దక్కింది. ఆ తర్వాత చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవీ ఊడింది. దీంతో ఆయన ప్రధాని మోదీపై బహిరంగంగానే విమర్శలు చేశారు. కానీ ఆయనపై బీజేపీ అధిష్టానం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టలేదు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం టికెట్ ఇవ్వక, తన వైఖరిని బయటపెట్టినట్లైంది.

ధిక్కార స్వరం
ఇటీవల పశ్చిమబెంగాల్ లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహించిన విపక్షాల ర్యాలీలో పాల్గొన్నారు శత్రుఘ్న సిన్హా. అక్కడ ఆశేష జనవాహిని ఉద్దేశించి ప్రసంగించారు. వాజ్ పేయి హయాంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని, మోదీ హయాం నియంతకు పరాకాష్ట అని విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications