భర్తను ఏడుసార్లు జైలుకు పంపించిన భార్య, 8 సారి ?. బెయిల్ ఇచ్చింది ఎవరంటే!

అహమ్మదాబాద్/గుజరాత్: వివాహం చేసుకున్న దంపతులు గొడవలు, కలహాల కారణంగా విడాకులు తీసుకుంటున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. దంపతుల రిలేషన్‌షిప్‌లో చీలిక వస్తే మళ్లీ కలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి సంఘటనలంలో దంపతుల మధ్య రిలేషన్ షిప్ దెబ్బ తింటే మళ్లీ కలుస్తారని గ్యారెంటీ లేదు.

అయితే ఇక్కడ ఒక్క జంట మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రేమ్‌చంద్ మాలి, సోనూ రీటా అనే దంపతుల వివాహం అనేక ఎత్తుపల్లాలు, పోలీసు కేసులు, జైలు జీవితం ఇలా అనేక మలుపులు తిరుగుతోంది. కొన్ని నెలల్లో మళ్లీ కలిసి జీవిస్తారు. ఇప్పుడు 7వ సారి భర్త ప్రేమ్ చంద్ ను అతని భార్య సోనూ జైలుకు పంపించింది. అయితే భర్త ప్రేమ్ చంద్ ను అతనిన భార్య సోనూ బెయిల్ పై విడిపించుకుని వచ్చింది.

భార్యను చంపేసి ఆమె తెలివైన మెదడు, మాంసం తినేసిన భర్త, మ్యాటర్ మాత్రం!

She is the wife who sent her husband to jail seven times and brought him out on bail in Gujarat

గుజరాత్‌లోని మెహసానా గ్రామానికి చెందిన ప్రేమ్‌చంద్ మాలి, సోనూ 2001లో వివాహం చేసుకున్నారు. 13 ఏళ్లుగా వీరి దాంపత్య జీవితంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. ప్రేమ్‌చంద్ మాలి అనే కూలీ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కుటుంబాన్ని పోషించాడు. వారి మధ్య ఆర్థిక సమస్య తప్ప మరో తీవ్రమైన సమస్య లేదు. అయితే 2014లో ప్రేమ్ చంద్, సోనూ దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి.

2015లో భర్త ప్రేమ్‌చంద్‌పై అతని భార్య సోనూ మొదటి సారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భౌతిక దాడి, మానసిక వేధింపుల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు కోర్టుకు చేరింది. చివరకు భార్యకు ప్రతినెలా రూ.2, 000 భృతి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కానీ కూలీగా పనిచేస్తున్న ప్రేమ్‌చంద్‌కు రూ. 2వేలు ఇవ్వడం తనకు సాధ్యం కాదని అన్నాడు. ఈ దెబ్బకు ప్రేమ్ చంద్ జైలు పాలయ్యాడు.

ఐదు నెలలు జైలులో ఉన్న తన భర్తప్రేమ్ చంద్ కు వ్యక్తిగతంగా బెయిల్ ఇచ్చిన సోనూ అతన్ని జైలు నుంచి విడుదల చేసింది.జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ ప్రేమ్ చంద్, సోనూ దంపతులు ఒక్కటయ్యారు. ఆ తర్వాత భార్య సోనూ తన భర్తపై శారీరక దాడి, మానసిక వేధింపుల కేసుల కింద అతన్ని అరెస్టు చేయించి జైలుకు పంపించింది. 2016 నుంచి 2020 వరకు ప్రతి సంవత్సరం ప్రేమ్ చంద్ ను అతని భార్య జైలుకు పంపించింది.

ప్రతిసారీ 5 నుంచి 6 నెలల పాటు ప్రేమ్ చంద్ జైలు శిక్ష అనుభవించాడు. తరువాత ప్రేమ్ చంద్ భార్య సోనూకు మనసు కరిగిపోయి ఆమె బెయిల్ ఇచ్చి భర్త ప్రేమ్ చంద్ ను బటయకు తీసుకువస్తున్నది. ఇలా ప్రేమ్‌ చంద్ బెయిల్‌పై విడుదలయ్యాడు. భర్త ప్రేమ్ చంద్ పై సోనూ ప్రేమ మళ్లీ పొంగిపొర్లుతుంది. ఆ విధంగా వారు కలిసి జీవిస్తున్నారు. కానీ కొద్దిరోజుల్లో మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుంది.

2022 ప్రారంభంలో, భార్య సోనూ మళ్లీ ఆమె భర్త ప్రేమ్ చంద్ మీద కేసు పెట్టింది. విచారణ జరిపిన పోలీసులు ప్రేమ్‌చంద్ ను మళ్లీ జైలుకు పంపించారు. మళ్లీ భార్య సోనూ ఆమె భర్తకు జూలై నెలలో బెయిల్ ఇచ్చింది. జైలు నుంచి విడుదలైన ప్రేమ్‌ చంద్ ఇప్పుడు అతని భార్య సోనూతో కలిసి ఉంటున్నాడు. ప్రేమ్ చంద్, సోనూ దంపతుల తీరుతో స్థానిక పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వీళ్లు ఎక్కడి మొగుడు పెళ్లామ్ సామి అంటూ స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. తాను మరోసారి జైలుకు పోతానని ప్రేమ్ చంద్ అతని స్నేహితుల దగ్గర చెప్పడంతో వారు హడలిపోయారని తెలిసింది. ఇప్పటికే ప్రేమ్ చంద్ ను అతని భార్య ఏడుసార్లు జైలుకు పంపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+