షీనా బోరా హత్య కేసు: జైలు నుంచి పీటర్ ముఖర్జియా విడుదల, ఆధారాలు నిరూపించలేని సీబీఐ..
షీనా బోరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేట్ టైకూన్ పీటర్ ముఖార్జియా జైలు నుంచి విడుదలయ్యారు. తన భార్య ఇంద్రాణి ముఖర్జీతో కలిసి షీనా బోరాను హత్య చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో పీటర్ ముఖర్జియా సహా ఇంద్రాణి ముఖార్జియా, ఇంద్రాణి రెండో భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ కూడా జైలులో ఊచలు లెక్కబెట్టారు. అయితే షీనాబోరా హత్య కేసులో పీటర్ పాత్ర ఉందని సీబీఐ ఆధారాలు నిరూపించలేకపోయింది. దీంతో ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఫిబ్రవరి 6వ తేదీన ముంబై హైకోర్టు పీటర్ ముఖార్జియా బెయిల్ మంజూరు చేసింది. పీటర్ తమకు ఆరువారాల కస్డడీకి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించగా నిరాకరించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సీబీఐ సన్నద్దమవగా హైకోర్టు స్టే విధించింది. దీంతో పీటర్ ముఖర్జీ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు.

విదేశాల్లో పీటర్..
షీనా బోరా హత్య జరిగిన సమయంలో పీటర్ ముఖర్జియా విదేశాల్లో ఉన్నారు. కానీ ఆయన ప్రోద్బలంతోనే హత్య జరిగిందని సీబీఐ వాదనలు వినిపించింది. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇప్పటికే ఇంద్రాణి బెయిల్ మీద బయటకొచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధర్ రోడ్‌లో గల జైలు నుంచి పీటర్ బయటకొచ్చారు. షీనా బోరా హత్యకేసులో గత నాలుగేళ్ల నుంచి ఆయన జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

మూడు పెళ్లిళ్లు..
విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డ ఇంద్రాణి .. ఒక్కటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. కాలేజీ రోజుల్లో సిద్ధార్థ్ దాస్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. వీరికి షీనా బోరా, మిఖాయిర్ బోరా పిల్లలు.. విలాసవంతమైన జీవితానికి అలవాటుపట్ట ఇంద్రాణి.. సిద్ధార్థ్‌ను వదిలి.. కోల్‌కతాలో వాలిపోయింది. అక్కడే సంజయ్ ఖన్నాను పెళ్లి చేసుకుంది. వీరికి విధి అనే కూతురు ున్నారు. 2001లో ముంబై వెళ్లాక ఇంద్రాణి.. మనసు మనసులాగా లేకుండా పోయింది. సంజయ్ ఖన్నాకు విడాకులు ఇవ్వకుండానే పీటర్ ముఖర్జియాని పెళ్లిచేసుకుంది.

చెల్లి కాదు పిన్ని..
ఇక ఇక్కడ కథ మొదలైంది. మొదటి భర్తకు జన్మించిన సంతానం షీనాబోరాను.. తన కూతురు కాకుండా చెల్లె అని పీటర్ ముఖర్జియా కుటుంబానికి పరిచయం చేసింది. చెల్లె అంటే తనకు పిన్ని అవుతోందని కూడా మరచి.. పీటర్ ముఖర్జియా కుమారుడు ఆమెతో ప్రేమ మైకంలో మునిగిపోయాడు. విషయం తెలిసి... ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. షీనాకు వార్నింగ్ ఇవ్వబోతే.. కూతురనని చెబుతానని ఆమె బెదిరించింది.
Recommended Video

రెండో భర్తతో కలిసి
లాభం లేదని నాలుగేళ్ల క్రితం తన రెండో భర్త సంజయ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్‌తో కలిసి షీనా బోరాను కన్న తల్లి ఇంద్రాణి హత్య చేయించింది. విషయం తెలిసిన పీటర్ ముఖర్జియా అంతకుముందే విదేశాలకు వెళ్లారు. సీబీఐ కేసులో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూడగా.. చార్జీషీట్ దాఖలు చేసింది. కేసు విచారణ జరుగుతుండగా.. 4 ఏళ్ల తర్వాత పీటర్ ముఖర్జియా జైలు నుంచి బెయిల్ మీద బయటకొచ్చారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications