నాకు ప్రాణ హాని ఉంది: ఇంద్రాణి ముఖార్జియా
న్యూఢిల్లీ: షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా తన ప్రాణాలకు హాని ఉందంటూ సోమవారం న్యాయస్థానం ముందు తెలిపింది. ' నాకు ప్రాణగండం ఉంది. నన్ను చంపడానికి నేనున్న జైల్లో కుట్ర జరుగుతోంది' అని ఇంద్రాణి ఆరోపించింది.
అంతేగాక, 'నాకిచ్చే ఆహారం కూడా బాగాలేదు. అందువల్లే నేను ఆసుపత్రి పాలవ్వాల్సి వచ్చింది. నన్ను ఎవరితోనూ మాట్లాడించడం లేదు. నేను చెప్పేది ఎవరూ పట్టించుకోవట్లేదు. దీనివెనక ఎవరో ఉన్నారు. నన్ను చంపించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు' అని ఇంద్రాణి అన్నారు.

అయితే ఈమె కొద్దిరోజుల క్రితం ఆసుపత్రి పాలైంది. కోర్టుకు హాజరైన సమయంలో ఆమె మోతాదుకు మించి మందులు తీసుకుందని వార్తలు వినిపించాయి. రెండు వారాల పాటు జేజే ఆసుపత్రిలోని వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన ఈమెను తిరిగి జైలుకు తరలించారు.
కాగా, 2012లో ఆమె తన కూతురు 24ఏళ్ల షీనా బోరాను హత్యచేసి శవాన్ని మాయం చేశారు. ఈ కేసులో ఇంద్రాణితో సహా మరో ముగ్గురు వ్యక్తులు కూడా కారాగారశిక్ష అనుభవిస్తున్నారు.ఇందులో ఈమె ప్రధాన నిందితురాలిగా ఉన్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications