Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షీనా నా మనవరాలే కానీ,ఇంద్రాణికి ఎవరితోనో అఫైర్!

ముంబై: ఇంద్రాణి మాజీ అత్త మరో సంచలన విషయాన్ని చెప్పింది. షీనా బోరా తన కొడుకు సిద్ధార్థ్ దాస్ కూతురేనని ఇంద్రాణి మాజీ అత్త బాంబు పేల్చింది. తన కొడుకు సిద్దార్థ్ దాస్‌కు షీనా కూతురు అని చెప్పింది. షీనాకు మరో సోదరి ఉండేదని పేర్కొంది.

అదే సమయంలో మిఖాయిల్ బోరా తన మనవడు కాదని తేల్చి చెప్పింది. అంగ్ల మీడియాలో వస్తున్న సమాచారం మేరకు.. మిఖాయిల్ బోరా తన మనవడు కాదని (సిద్దార్థ్ దాస్ తల్లి) చెప్పిందని తెలుస్తోంది.

షిల్లాంగ్‌లో ఉన్న సమయంలో ఇంద్రాణి తన కొడుకు సిద్ధార్థ్ దాస్‌ను పెళ్లి చేసుకుందని చెప్పింది. ఇంద్రాణి తొలుత ఓ అమ్మాయికి జన్మనిచ్చిందని, అమే షీనా అని చెప్పింది. ఆ తర్వాత మరో అమ్మాయికి జన్మను ఇచ్చిందని చెప్పింది. షీనా పుట్టిన ఏడాదిన్నర తర్వాత ఆ రెండో పాప పుట్టిందని చెప్పింది.

Sheena had a sister; Mikhail not my grandson, says Siddharth Das's mother

సిద్దార్థ్ దాస్, ఇంద్రాణిలు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఇద్దరు కూతుళ్లేనని, కొడుకు పుట్టలేదని మాజీ అత్త చెప్పింది. షీనా పుట్టిన తర్వాత తన కొడుకు సిద్ధార్థ్ అప్ సెట్ అయినట్లు చెప్పింది. దానికి కారణం వెల్లడించింది. ఇంద్రాణికి ఎవరితోనో ఎఫైర్ ఉందనే అనుమానం వచ్చి బాధపడ్డాడని చెప్పింది.

షీనా పుట్టిన తర్వాత ఏడాదిన్నరకు పుట్టిన మరో పాప తన కూతురు కాదని తన కొడుకు సిద్దార్థ్ దాస్ తనతో ఆవేదనగా చెప్పాడని ఇంద్రాణి మాజీ అత్త చెప్పింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పింది.

ఆ తర్వాత ఇంద్రాణి తన ఇద్దరు కూతుళ్లను తీసుకొని షిల్లాంగ్ నుంచి వెళ్లిపోయిందని చెప్పింది. నేను మరోసారి చెబుతున్నానని, మిఖాయిల్ బోరా తన మనమడు కాదని పేర్కొంది. అలాగే తన కొడుకు సిద్ధార్థ్ దాస్ తనయుడు కాదని చెప్పింది. ఆ తర్వాత సిద్ధార్థ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని తెలిపింది.

దొరికిన సూటుకేస్ మిస్టరీ!

షీనా బోరా హత్య కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తోన్న విషయం తెలిసిందే. వొర్లి ప్రాంతంలో ఉన్న పీటర్ ముఖర్జియా, ఇంద్రాణిల నివాసం నుంచి ఓ సుటుకేసును ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2012లో షీనాతో పాటు ఆమె సోదరుడు మిఖాయిల్‌ను కూడా చంపేసి, అదేవిధంగా శవాన్ని పాతిపెట్టేందుకు ఉద్దేశించిన సూటుకేసు అయి ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఆదివారం నాడు ఇంద్రాణీ, మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాం రాయ్‌లను పోలీసులు రాయగఢ జిల్లాలోని షెన్ తెహసీల్ అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లి హత్య ఘటనను పునఃసృష్టించారు. 2012లో షీనాను గొంతు నులిమి హత్య చేసి అటవీ ప్రాంతంలో తగులబెట్టిన నేపథ్యంలో నాటి ఆ క్రూర ఘటన క్రమాన్ని తిరిగి అదేవిధంగా పునఃసృష్టించేందుకు పోలీసులు వారిని అడవుల్లోకి తీసుకు వెళ్లారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+