జయ పిటిషన్ తమిళనాడుకు, మాజీ ప్రధాని విజ్ఞప్తి

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలుల్లో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను సాధ్యమైనంత తర్వగా తమిళనాడుకు మారిస్తే బాగుంటుందని మాజీ ప్రధాని దేవెగౌడ తెలిపారు. ప్రతిరోజూ తమిళనాడు నుంచి వేల సంఖ్యలో వస్తున్న జయలలిత మద్దతుదారుల వల్ల కర్ణాటకలో శాంతిభద్రలకు ప్రమాదం ఏర్పడే ఆవకాశం ఉందని అన్నారు.

విలేకరులతో దేవెగౌడ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ కేసును తమిళనాడుకు బదిలీ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి తాను విజ్ఞుప్తి చేశానని అన్నారు. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో జయలలిత మద్దతుదారులు నిరసన తెలిపేందుకు వస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు స్పెషల్ ఫోర్స్‌ను ఉపయోగించాల్సి వస్తుంది. మనమెందుకు ఈ భారం తీసుకోవాలని అన్నారు.

Shift Jayalalithaa to Tamil Nadu, suggests HD Deve Gowda

ఆమెకు బెయిల్ వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కనబెడితే.. ఇందులో మనం చేసేది ఏమీ లేదు. అది న్యాయపరమైన విషయం, మనకెందుకు ఈ భారం అని ప్రశ్నించారు. వారం రోజులుగా కర్ణాటక హైకోర్టు, కేంద్ర కారాగారం నిరసనలతో అట్టుడికిపోతోంది. ఎప్పుడేం సంఘటన సంభవిస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో జయలలితను తమిళనాడుకు తరలిస్తే తంటాలుండవని కర్ణాటక సర్కార్ యోచిస్తోంది.

ఇప్పటికే కావేరి నదీజలాలు, తిరువళ్లువర్‌, సర్వజ్ఞ విగ్రహాల స్థాపన వంటి వివాదాలతో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు బలహీనమయ్యాయి. జయలలిత ప్రభావం తమిళ, కన్నడిగుల మధ్య సంబంధాలపై పడే అవకాశం ఉన్నట్లు సిద్ధరామయ్య ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జయలలిత బెయిల్ పిటిషన్‌ను తమిళనాడుకే పంపించేందుకు కసరత్తు చేస్తోంది.

బెంగుళూరులోని ప్రత్యేక న్యాయస్దానం జయలలితకు నాలుగేళ్లు జైలు శిక్షతో పాటుస, రూ. 100కోట్లు జరిమానాని విధించిన సంగతి తెలిసిందే. దీంతో జయలలిత బెంగళూర్‌లోని పరప్పన అగ్రహార కేంద్రకారాగారంలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+