డిసెంబర్ 1న ఉద్ధవ్ ప్రమాణం: థాకరే కుటుంబం నుంచి తొలి నేతగా.. !
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఆరంభం అయ్యాయి. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి అధి నాయకుడిగా శివసేన పేరును ఏకగ్రీవంగా ఆమోదించిన నేపథ్యంలో..మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకోనున్నారు. ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఖచ్చితంగా తెలియ రాలేదు. ఈ నెల 28వ తేదీన (గురువారం) లేదా వచ్చే నెల 1వ తేదీన (ఆదివారం) ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.

కూటమి అధినేతగా ఉద్ధవ్..
ప్రస్తుతం ముంబైలోని ట్రైడెంట్ హోటల్ లో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నేతల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలోనే ఉద్ధవ్ థాకరేను అధికారికంగా కూటమి అధినేతగా ఎన్నుకోనున్నారు. ఈ భేటీ ముగిసిన అనంతరం కూటమి నాయకులు సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. కూటమి నాయకుడిగా ఉద్ధవ్ థాకరే పేరును వెల్లడిస్తారని అంటున్నారు. ఈ మూడు పార్టీలకు చెందిన 162 మందికి పైగా ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరయ్యారు.

థాకరే కుటుంబం నుంచి తొలిసారిగా..
ఇదిలావుండగా- థాకరే కుటుంబానికి చెందిన ఓ నాయకుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులు కావడం చరిత్రలో ఇదే తొలిసారి. థాకరే కుటుంబం నుంచి ఇప్పటిదాకా ఎవ్వరూ ముఖ్యమంత్రిగా పని చేయలేదు. అనేక హైడ్రామాల మధ్య ఆ అవకాశాన్ని ఉద్ధవ్ థాకరే సొంతం చేసుకున్నారు. దీనితో శివసేన నాయకులు, కార్యకర్తలు ఫుల్ జోష్ గా కనిపిస్తున్నారు. ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీ వద్ద పెద్ద ఎత్తున చేరుకున్నారు సేన కార్యకర్తలు. దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసిన వెంటనే మాతోశ్రీకి బారులు తీరారు. బాణాసంచాను కాల్చి సందడి చేస్తూ కనిపించారు.

మహా వికాస్ అఘాడిగా ఆవిర్భావం..
ఉద్ధవ్ థాకరే, ఆయన భార్య రష్మి థాకరే, కుమారుడు, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్య థాకరే, సంజయ్ రౌత్, సునీల్ రౌత్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆ పార్టీ సీనియర్ నాయకులు ప్రఫుల్ పటేల్, నవాబ్ మాలిక్, కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లికార్జున ఖర్గే, అశోక్ చవాన్ తదితరులు పాల్గొన్నారు. కూటమికి `మహా వికాస్ అఘాడి అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించారు. దీనితో పాటు పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని కూటమి నాయకులు వెల్లడించారు. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలనే విషయంపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చినందున.. దీనిపై ఎలాంటి చర్చలు లేవని తెలిపారు.

మంత్రివర్గం కూర్పుపై స్పష్టత..
ఉప ముఖ్యమంత్రి పదవులు సైతం ఖరారైన విషయం తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున జయంత్ పాటిల్, కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ శాసన సభా పక్ష నాయకుడు బాలాసాహెబ్ థొరట్.. ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయాలనే విషయంపైనా ఓ స్పష్టత ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలనే అంశంపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications