మహా రాజకీయాల్లో అనూహ్యం:శరద్ పవార్ తో శివసేన కీలక నేత భేటీ: సోనియా ఎంట్రీ..ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. తాము ప్రతిపాదించిన 50-50 ఫార్ములాను అంగీకరించని భారతీయ జనతాపార్టీకి కోలుకోలేని విధంగా దెబ్బ తీయడానికి మిత్రపక్షం శివసేన కత్తులు నూరుతోంది. కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కూటమిలో చేరే దిశగా అడుగులు వేస్తోంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కుడిభుజంగా పేరున్న ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్.. ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీమంత్రి శరద్ పవార్ తో సమావేశం అయ్యారు. ముంబైలోని శరద్ పవార్ ఇంటికి వెళ్లి మరీ కలిశారు. సుమారు గంటకు పైగా వారిద్దరి మధ్య చర్చలు చోటు చేసుకున్నాయి.

వారం రోజుల తరువాత కూడా..

వారం రోజుల తరువాత కూడా..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు దాటిపోయింది. అయినప్పటికీ..అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. మహారాష్ట్రతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న హర్యానా హంగ్ ఏర్పడినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ సఫలం కాగలిగింది. జన్ నాయక్ జనతాపార్టీ (జేజేపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరహా పరిస్థితి మహారాష్ట్రలో ఏర్పడలేదు. ముఖ్యమంత్రి పదవిని 50-50 ప్రాతిపదికన పంచుకోవాలంటూ మిత్రపక్షం శివసేన చేసిన ప్రతిపాదనను బీజేపీ అంగీకరించకపోవడంతో ప్రతిష్ఠంభన నెలకొంది. అయిదేళ్ల పాటూ తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు కూడా.

ఆ ఒక్కటీ ఇచ్చేస్తే..

ఆ ఒక్కటీ ఇచ్చేస్తే..

ముఖ్యమంత్రి పదవిని తమకు వదిలేస్తే.. కాంగ్రెస్-ఎన్సీపీల కూటమిలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామంటూ సంజయ్ రౌత్ కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో శివసేన నాయకుడే ఉంటాడని, అలా హామీ ఇస్తే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారని సమాచారం. శివసేనకు మద్దతు ఇచ్చేది లేదంటూ ఫలితాలు వెలువడిన రోజే శరద్ పవార్ ప్రకటించారు. అలాంటి నాయకుడితోనే సంజయ్ రౌత్ భేటీ కావడం వల్ల ఆయన మెత్తబడినట్లు తెలుస్తోంది.

నేడు హస్తినకు మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు

నేడు హస్తినకు మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు

మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శుక్రవారం హస్తినకు బయలుదేరి వెళ్లబోతున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న పడిన పీటముడిని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు పృథ్వీరాజ్ చవాన్, అశోక్ చవాన్, సీనియర్ నాయకుడు బాలాసాహెబ్ థొరట్ తదితరులు సోనియా గాంధీని కలుసుకోనున్నారు. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను ఆమెకు వివరించనున్నారు. సోనియాగాంధీ దీనికి అంగీకారాన్ని వ్యక్తం చేయాల్సి ఉంటుందని, అదే జరిగితే- శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పృథ్వీరాజ్ చవాన్ ఇదివరకే వెల్లడించారు.

కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కలిస్తే..

కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కలిస్తే..

మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో అధికారాన్ని అందుకోవాలంటే 145 సీట్ల సంఖ్యాబలం అవసరం అవుతుంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 సీట్లను కైవసం చేసుకున్నాయి. ఈ రెండూ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ అందుకుంటాయి. 50-50 ఫార్ములాపై ప్రతిష్ఠంభన నెలకొనడంతో బీజేపీకి అధికారాన్ని దూరం చేయడానికి కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పావులు కదిపే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ కు 44, దాని మిత్రపక్షం ఎన్సీపీకి 54 స్థానాలు ఉన్నాయి. 56 సీట్లు ఉన్న శివసేన ఈ రెండు పార్టీలతో కలిస్తే మొత్తం బలం 154కు చేరుతుంది. దీనితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. శివసేనకు ముఖ్యమంత్రిని వదులుకోవడానికి కాంగ్రెస్, ఎన్సీపీలు సిద్ధంగా ఉన్నాయి. శివసేనతో చేతులు కలపడానికి ఎన్సీపీ నుంచి అభ్యంతరం వ్యక్తమౌతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+