వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్‌ను కలిసిన శివసేన... కాంగ్రెస్, ఎన్సీపీలు టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపుతిరుగుతుంది. సిద్దాంతపరంగా ఒకే భావాలు కల్గిన పార్టీల మధ్య వైరుద్యాలు కొలిక్కి రావడం లేదు. దీంతో సీఎం సీటుపై ఎటు తేల్చలేని పరిస్థితి మహాలో నెలకొంది. బీజేపీ శివసేనల పోత్తుపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో ఇరు పార్టీల మధ్య ఉత్కంఠ నెలకొంది. మరోవైపు శివసేనకు సీఎం సీటు కేటాయించాలనే పట్టుదలతో ముందుకు సాగుతోంది. ఈనేపథ్యంలోనే బీజేఏల్పీ నాయకుడిగా ఫడ్నవీస్‌ను ఎన్నుకున్న అనంతరం నేడు శివసేన ఎమ్మెల్యేలు సమావేశం అయి తమ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఏక్‌నాథ్ షిండే ఎన్నుకున్నాయి. అనంతరం అదిత్యా ఠాక్రేతోపాటు శివసేన అగ్రనేతలు మహారాష్ట్ర గవర్నర్ కలిసి తాజా పరిస్థితులపై చర్చించారు.

మహారాష్ట్రకు కాబోయో సీఎం శివసైనికుడే...

మహారాష్ట్రకు కాబోయో సీఎం శివసైనికుడే...

దీంతో ఇరుపార్టీలు పోటాపోటిగా తమ ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఒకమెట్టు దిగి గతంలో కంటే రెండు మంత్రి పదవులు అదనంగా ఇవ్వడంతోపాటు డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. అయితే ఇందుకు శివసేన ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే శివసేన అధనేత ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ శాసనపక్షం ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అయిన అనంతరం తాజా పరిణామలపై చర్చించారు. మహారాష్ట్రకు కాబోయో సీఎం శివసైనికుడే అంటూ మరోసారి వ్యాఖ్యానించారు.

 కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు టచ్‌లో ఉన్నారంటూ శివసేన వ్యాఖ్యలు

కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు టచ్‌లో ఉన్నారంటూ శివసేన వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటు వచ్చిన తొందర ఏమి లేదని అన్నారు. మీకు ఏమైన తొందర ఉందా అంటూ ఎమ్మెల్యేలను సైతం ప్రశ్నించారు. ఇక శివసేనకు హ్యండ్ ఇస్తున్న బీజేపీకి షాక్ ఇచ్చేందుకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్సీపీతో టచ్‌లో ఉన్నామని స్పష్టం చేశారు. తమకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ పార్టీతో చర్చలకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఇరుపార్టీల మధ్య చర్చలు రద్దయ్యాయి.

గవర్నర్‌ను కలిసిన శివసేన నేతలు

గవర్నర్‌ను కలిసిన శివసేన నేతలు

మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు గురువారం అదిత్యా ఠాక్రేతోపాటు ఇతర సీనియర్ నేతలు గవర్నర్ భగత్‌సింగ్‌ను కలిశారు. తమ నేతల బలం నిరూపించుకునేందుకు గవర్నర్‌ను వెళ్లి కలిశారు. తమకు మద్దతు ఇస్తున్న పార్టీలతో పాటు ఇతర అంశాలపై గవర్నర్‌కు వివరించినట్టు తెలుస్తోంది. అయితే వరద భాదిత ప్రాంతాల ప్రజలను అదుకునేందుకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు.

బీజేపీ, శివసేన మధ్యలో కాంగ్రెస్

బీజేపీ, శివసేన మధ్యలో కాంగ్రెస్

ఇక శివసేన, బీజేపీల మధ్య ఉన్న గ్యాప్‌ను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు విపక్షాలు కూడ ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శివసేన తమతో అధికారం పంచుకునే ఆలోచనలతో ముందుకు వస్తే, పార్టీ హైకమాండ్‌తో చర్చించడంతోపాటు మిత్రపక్ష పార్టీల సభ్యులతో కూడ చర్చిస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయం ఎటు మలుపు తిరుగుతుంతో అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. మొత్తం మీద పూర్తి మెజారీటి ఏ పార్టీకి రాకపోవడంతో ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్న ప్రభుత్వ ఏర్పాటు ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది.

English summary
A delegation of Shiv Sena leaders, including MLA Aditya Thackeray, on Thursday met Maharashtra Governor Bhagat Singh Koshyari at the Raj Bhavan here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X