వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివ‌సేన ఎంపీకి ఈడీ షాక్.. ఆస్తులు జ‌ప్తు ; జైలుకు పంపినా భ‌య‌ప‌డేది లేద‌న్న సంజ‌య్ రౌత్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన కీలక నేతలకు ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాక్ మీద షాక్ ఇస్తోంది. వారిపై దాడులను పెంచింది. తాజాగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు, శిససేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ అదికారులు షాక్ ఇచ్చారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన, కుటుంబానికి చెందిన ఆస్తులను అటాచ్ చేసింది. దీనిపై శివసేన నేతలపై త్రీవ స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కేంద్రం కుట్ర రాజకీయలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంజ‌య్ రౌత్‌కు ఈడీ షాక్.. ఆస్తులు జప్తు

సంజ‌య్ రౌత్‌కు ఈడీ షాక్.. ఆస్తులు జప్తు

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కుటుంబానికి చెందిన దాదాపు రూ. 11 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ రూ. 11 కోట్లలో 9 కోట్లు ఆస్తులు సంజయ్ రౌత్ కుమారుడుకు సంబంధించింది. మిగతా రూ 2 కోట్లు ఆస్తులు రౌత్ భార్యకు చెందింది.

అటు మంబాయిలోని దాదర్ సబర్బన్ లో ఓ ఫ్లాట్ ను ఒక ఫ్లాట్, అలీబాగ్ లోని కొన్ని ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. దాదాపు రూ.1034 కోట్ల విలువైన భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో సంజయ్ రౌత్ కు ఆయన కుటుంబానికి చెందిన ఆస్తుల్ని స్తంభింపచేసినట్లు తెలిపింది.

జైలుకు పంపినా భ‌య‌ప‌డేది లేదు..

జైలుకు పంపినా భ‌య‌ప‌డేది లేదు..

మరోవైపు తన కుంటుంబానికి చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేయడంపై ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. రాజ్యాంగ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. వారి బెదిరింపులకు బెదిరేది లేదన్నారు. నా ఆస్తులు జప్తు చేసినా,. నా పై కాల్పులు జరిపినా లొంగేది లేదన్నారు.

తనను జైలుకు పంపినా, ఏమాత్రం భయపడేది లేదని బీజేపీని హెచ్చరించారు. సంజయ్ రౌత్ అనే వ్యక్తి బాలా సాహెబ్ థాకరే అనుచరుడు, శివసైనికుడని విరుచుకుపడ్డారు. తాను చూస్తూ కూర్చునే రకం కాదన్నారు. ప్రతి ఒక్కరి బండారం బయడపెడతానని హెచ్చరించారు. త్వరలోనే నిజాలు వెలుగులోకి వస్తారని హెచ్చరించారు.

బీజేపీ కుట్రలో భాగ‌మే..?

బీజేపీ కుట్రలో భాగ‌మే..?

మరో వైపు ఈ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్‌కు సన్నిహితుడిగా పేరున్న ప్రవీణ్ రౌత్ ను ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 1న ఛార్జీషీట్ కూడా దాఖలు చేసింది. పీఎంసీ బ్యాంకు మోసం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది. వ్యాపారి ప్రవీణ్ రౌత్ భార్య మాధురితో వర్షారౌత్ కు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఈడీ ఆమెని ప్రశ్నించింది. అటు ఇదంతా బీజేపీ కుట్ర రాజకీయలలో భాగమేనని సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు.

English summary
MP Sanjay Routh says I am not afraid of being assets confiscated, shot or sent to jail..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X