వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముండే సిస్టర్స్‌పై మోదీ పాచిక: పంకజ, ప్రీతమ్‌ల కెరీర్ ఖతం -కేంద్ర కేబినెట్ కూర్పుపై శివసేన ఫైర్

|
Google Oneindia TeluguNews

సొంత నేతలైనా, మిత్రపక్షాలైనా, ఒకే కుటుంబం లేదా ఒకే సమాజికవర్గానికి చెందిన నేతలను బీజేపీ హైకమాండ్ డీల్ చేసే విధానం ఒకే తీరుగా ఉంటుందని, బీహార్ లో ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ పట్ల కమలనాథులు అనుసరించిన వైఖరినే.. మహారాష్ట్రలో సొంత పార్టీకి చెందిన ముండే కుటుంబం పట్లా కనబరుస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రెండు రోజుల కిందట కేంద్ర కేబినెట్ లో చోటు చేసుకున్న భారీ ప్రక్షాళన ఒక్కో రాష్ట్రంలో తీరొక్క ప్రభావాన్ని చూపగా, మోదీ పాచికతో మరాఠా గడ్డపై ముండే సిస్టర్స్ కెరీర్ ప్రమాదంలో పడిందని శివసేన పార్టీ పేర్కొంది. వివరాలివి..

అలా ప్రమాణం, ఇలా మోదీపై తిట్లు -కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై హ్యాకర్ల పిడుగుఅలా ప్రమాణం, ఇలా మోదీపై తిట్లు -కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై హ్యాకర్ల పిడుగు

ముండే అనుచరుడికి పట్టం

ముండే అనుచరుడికి పట్టం

మహారాష్ట్ర వాసులు 'లోక్ నేత'గా పిలుచుకునే గోపీనాథ్ ముండే 2014లో చనిపోయేనాటికి బీజేపీలో టాప్ లీడర్. ఆయన రాజకీయ వారసులుగా కూతుళ్లైన పంకజా ముండే, ప్రీతమ్ ముండేలు బీజేపీలోనే కొనసాగుతూ గతంలో భారీ మెజార్టీతో ఎంపీలుగానూ గెలుపొందారు. ఫడ్నవిస్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేసిన పంకజా.. చివరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, బీజేపీ జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. మొన్నటి మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పంకజ సోదరి ప్రీతమ్ ముండేకు మంత్రి పదవి లభిస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ముండే ఫ్యామిలీ దాదాపు సంబురాలకు సిద్దం అవుతుండగా, అనూహ్య రీతిలో ముండే సిస్టర్స్ ను కాదని, గోపీనాథ్ ముండే అనుచరుడైన భగవత్ కిషన్ రావు కరద్‌ కు మోదీ కేబినెట్ లో చోటు దక్కింది. ఈ పరిణామంపై..

కేసీఆర్ జోరు: 10న మళ్లీ వాసాలమర్రికి సీఎం -50వేల ఉద్యోగాల తర్వాత తొలి టూర్ -13న కేబినెట్ భేటీకేసీఆర్ జోరు: 10న మళ్లీ వాసాలమర్రికి సీఎం -50వేల ఉద్యోగాల తర్వాత తొలి టూర్ -13న కేబినెట్ భేటీ

పంకజ, ప్రీతమ్‌ల కెరీర్ ఖతం

పంకజ, ప్రీతమ్‌ల కెరీర్ ఖతం

భగవత్ కరద్(రాజ్యసభ ఎంపీ) కు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించడం ముమ్మాటికీ ముండే సిస్టర్స్ పొలిటికల్ కెరీన్ ను ఖతం పట్టించడానికేనని మరాఠా పార్టీ శివసేన ఆరోపిస్తున్నది. తన సామ్నా పత్రిక సంపాదకీయంలో ఈ మేరకు శివసేన కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రీతమ్ ముండే, భగవత్ కరద్ ఒకే(వంజర) కులానికి చెందినవారని, ఆ కులంలో చీలిక తేవడంతోపాటు ముండే రాజకీయ వారసత్వాన్ని సిస్టర్స్ చేతిలోనుంచి లాగేసి, కరద్ కు కట్టబెట్టినట్లు అవుతుందనే కోణంలోనే కేంద్ర మంత్రివర్గ కూర్పు జరిగిందని, తొలిసారి రాజ్యసభ ఎంపీ అయిన కరద్ కంటే ముండే సిస్టర్స్ ఎందులోనూ తక్కువ కాదని, ఈ పరిణామంతో పంకజ, ప్రీతమ్ ల పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడిందని శివసేన పార్టీ పేర్కొంది.

Recommended Video

PM Modi Numerology Secret,కేబినెట్ విస్తరణలో ప్రతీ అంశంలో అంతా ఏడు తోనే ముడిపెడుతూ..!!
బీజేపీ కార్యక్తలకు పుండు మీద కారం

బీజేపీ కార్యక్తలకు పుండు మీద కారం


గోపీనాథ్ ముండే అనుచరుడైన భగవత్ కరద్ కు కేంద్రంలో పదవి ఇవ్వడం ద్వారా పంకజా ముండే రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు ఏర్పడ్డాయన్న శివసేన.. మహారాష్ట్ర నుంచి కేంద్ర కేబినెట్ లో పదవులు దక్కించుకున్న మరో ఇద్దరు నేతల వల్లా రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని పేర్కొంది. కొత్తగా కేంద్ర మంత్రి పదవులు పొందిన భారతి పవార్, కపిల్ పాటిల్‌లు ఈ మధ్యే ఎన్సీపీ నుంచి బీజేపీలోకి రావడం, బీజేపీ సీనియర్లను పక్కనపెట్టిమరీ ఫిరాయింపు నేతలకు పదవులు ఇవ్వడంతో కాషాయ జెండా మోస్తున్న కార్యకర్తలకు పుండు మీద కారం చల్లినట్లయిందని శివసేన పార్టీ అభిప్రాయపడింది. ముందు నుంచి బీజేపీ నేతయిన నారాయణ రాణేకు మంత్రి పదవి విషయంలో మాత్రమే ఆ పార్టీ కేడర్ సంతృప్తిగా ఉన్నారని 'సామ్నా' ఎడిటోరియల్ లో రాశారు. వైద్య, విద్య, పారిశ్రామక రంగాలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న వేళ కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులతో పరిస్థితులు చక్కబడతాయని బీజేపీ ఆశిస్తున్నదా? అని శివసేన తన 'సామ్నా' కథనంలో ఎద్దేవా చేసింది.

English summary
In an editorial in party mouthpiece 'Saamana'', The Shiv Sena on Friday alleged that the inclusion of BJP's Rajya Sabha member Bhagwat Karad into the Union council of ministers, instead of late leader Gopinath Munde's daughter and two-time MP Pritam Munde, was a plan to finish off the political career of her sister Pankaja Munde, a former Maharashtra minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X