వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ టైంలో బుల్లెట్ రైలు అవసరమా, క్రెడిట్ అంతా జపాన్‌కే: మోడీపై శివసేన

ముంబై - అహ్మదాబాద్ మార్గంలో గురువారం బుల్లెట్ రైలుకు ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షింజో ఎబే శంకుస్థాపన చేసిన కాసేపటికే శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Bullet Train is 'Unnecessary' Project బుల్లెట్ రైలు అవసరమా ?

ముంబై: ముంబై - అహ్మదాబాద్ మార్గంలో గురువారం బుల్లెట్ రైలుకు ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షింజో ఎబే శంకుస్థాపన చేసిన కాసేపటికే శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.

జపాన్‌తో స్నేహం తీసుకొస్తున్న బుల్లెట్ రైలు: మోడీ థ్యాంక్స్జపాన్‌తో స్నేహం తీసుకొస్తున్న బుల్లెట్ రైలు: మోడీ థ్యాంక్స్

రూ.1.08 లక్షల కోట్లను లూటీ చేసేందుకే బుల్లెట్ రైలు ప్రాజెక్టును మోడీ తెరపైకి తెచ్చారని అధికార సామ్నా పత్రికలో దుయ్యబట్టారు.

మోడీ - పీయూష్ గోయల్.. శివసేన సంచలన ఆరోపణ

మోడీ - పీయూష్ గోయల్.. శివసేన సంచలన ఆరోపణ

ఇది మోడీ అత్యంత ఖరీదైన డ్రీమ్ అని, దాని పేరిట దేశం సొమ్మును దోపిడీ చేయాలనుకుంటున్నారని శివసేన ఆరోపించింది. ముఖ్యమంగా ఈ మధ్య పీయూష్ గోయల్‌ను రైల్వే మంత్రిని చేశారని, ఆయన బిజెపి కోశాధికారి కూడా అని చెప్పారు. అందుకే ఆయనను ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టు కోసం రైల్వే మంత్రిని చేశారని ఆరోపించారు.

ఇలాంటి సమయంలో బుల్లెట్ రైలు అవసరమా?

ఇలాంటి సమయంలో బుల్లెట్ రైలు అవసరమా?

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ఒక అనవసరమైన ప్రాజెక్టుగా శివసేన పత్రిక సామ్నా అభివర్ణించింది. భారతీయ రైల్వే, మూంబై లోకల్‌ ట్రైన్లు ప్రతీరోజు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో బుల్లెట్‌ రైలు అనవసరమని పేర్కొంది.

మహారాష్ట్ర ఖర్చు ఎక్కువ పెడుతోంది

మహారాష్ట్ర ఖర్చు ఎక్కువ పెడుతోంది

ఇది సామాన్యుల కోసం చేపట్టిన ప్రాజెక్టు కాదు సంపన్న, బిజినెస్‌ క్లాస్‌ వారి కోసం నిర్మిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. రుణాలు మాఫీ చేయమని రైతులు వేడుకుంటుంటే పట్టించుకోకుండా బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతోందని విమర్శించారు. దీని వల్ల రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోతున్నారని పేర్కొంది.

జపాన్ వనరులు ఇస్తోంది

జపాన్ వనరులు ఇస్తోంది

ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.1.08లక్షల కోట్లు వెచ్చిస్తోందని, ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.30వేల కోట్లు ఇవ్వనుందని సామ్నా పేర్కొంది. కార్మికులతో సహా కావాల్సిన వనరులన్నీ జపాన్‌ ఇస్తుందని పేర్కొంది.

క్రెడిట్ అంతా జపాన్‌కు వెళ్తుంది

క్రెడిట్ అంతా జపాన్‌కు వెళ్తుంది

నిధులు, స్థలం మాత్రం మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రభుత్వాలు ఇస్తున్నాయని, ఘనత మాత్రం జపాన్‌కు వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. దీని ద్వారా మనల్ని దోచుకుంటున్నారని పేర్కొంది. బుల్లెట్‌ రైలును తీసుకురావాల్సిన అవసరం అసలు ఉందా? అని శివసేన ప్రశ్నించింది.

English summary
While the much-talked about Mumbai-Ahmedabad bullet train project has been widely welcomed, BJP's ally in Maharashtra, Shiv Sena, has strongly condemned what it calls an 'unnecessary' project. In an acerbic editorial published in its mouthpiece 'Saamna', the Maharashtra-based party said on Thursday that a bullet train between Mumbai and Ahmedabad is 'unnecessary' when the Indian Railways and the Mumbai local trains are already suffering, and several basic problems of the country are still unresolved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X