వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్పల్ పారికర్ కు మద్దతుగా.. మాట నిలబెట్టుకున్న శివసేన; పనాజీ నుండి పోటీ ఉపసంహరణ: టార్గెట్ బీజేపీ

|
Google Oneindia TeluguNews

గోవాలోని పనాజీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు, ఉత్పల్ పారికర్ కు శివసేన మద్దతుగా నిలిచింది. ఇంతకుముందు గోవాలోని పనాజీలో నుండి అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దింపాలని భావించిన శివసేన తమ పార్టీ నుంచి అభ్యర్థిని ఉపసంహరించుకుంది. ఫిబ్రవరి 14న జరగనున్న గోవా రాష్ట్ర ఎన్నికలలో బిజెపికి దూరమై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.

Goa elections: బీజేపీకి రెబల్స్ బెడద; పనాజీతో సహా నాలుగు చోట్ల టెన్షన్ పెడుతున్న స్వతంత్రులుGoa elections: బీజేపీకి రెబల్స్ బెడద; పనాజీతో సహా నాలుగు చోట్ల టెన్షన్ పెడుతున్న స్వతంత్రులు

 పనాజీ స్థానంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అన్న శివసేన

పనాజీ స్థానంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అన్న శివసేన

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పనాజీ నుంచి పోటీ చేసేందుకు ఉత్పల్ పారికర్‌కు బీజేపీ టిక్కెట్టు లభించకుంటే అన్ని విపక్షాలు మద్దతు ఇవ్వాలని గతంలో కోరారు. ఉత్పల్ పారికర్ పనాజీ స్థానం నుండి స్వతంత్రంగా పోటీ చేస్తే, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మరియు గోవా ఫార్వర్డ్ పార్టీలతో సహా అన్ని బిజెపియేతర పార్టీలు అతని అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని తాను ప్రతిపాదిస్తున్నానని సంజయ్ రౌత్ పేర్కొన్నారు . ఇది మనోహర్‌భాయ్‌కి నిజమైన నివాళి! అని ఆయన వేల్లాదిమ్చారు. ఈ మేరకు తాజాగా మేము మా మాటను నిలబెట్టుకుంటున్నాము.

 పనాజీ పోటీ నుండి వైదొలిగిన శివసేన నేత శైలేంద్ర వెలింగ్‌కర్‌

పనాజీ పోటీ నుండి వైదొలిగిన శివసేన నేత శైలేంద్ర వెలింగ్‌కర్‌

శివసేన తన అభ్యర్థి శైలేంద్ర వెలింగ్‌కర్‌ను పనాజీ నుండి పోటీకి ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించింది శివసేన. అంతే కాదు, మా కార్యకర్తలు ఉత్పల్ పారికర్‌కు పూర్తిగా మద్దతు ఇస్తారు అని ప్రకటించారు. ఈ ఎన్నికలు గోవా పై అధికారం కోసం కాదు గోవా ప్రక్షాళన కోసం జరుగుతున్న ఎన్నికలని, ఉత్పల్ పారికర్ కు తాము మద్దతు ఇస్తున్నామని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేను ట్యాగ్ చేస్తూ శివసేన నేత ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.

బీజేపీని టార్గెట్ చేసి ఉత్పల్ కు మద్దతుగా శివసేన .. సంజయ్ రౌత్ ట్వీట్

బీజేపీని టార్గెట్ చేసి ఉత్పల్ కు మద్దతుగా శివసేన .. సంజయ్ రౌత్ ట్వీట్

సంజయ్ రౌత్ ట్వీట్‌లో ఉత్పల్ పారికర్ చేసిన వ్యాఖ్యలను రీ ట్వీట్ చేశారు . "దివంగత మనోహర్ పారికర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నేర చరిత్ర ఉన్న వ్యక్తికి మీరు టిక్కెట్ ఇస్తారా?" అన్న ప్రశ్నలు స్పందించి స్పష్టంగా అటానాసియో "బాబుష్" మాన్‌సెరేట్‌ను ఎంచుకున్నందుకు బిజెపిని లక్ష్యంగా చేసుకుంది.ఇంజనీర్ అయిన ఉత్పల్ పారికర్, పనాజీలో బిజెపి అభ్యర్థికి వ్యతిరేకంగా పోరాడటానికి తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా తన తండ్రి గోవాలో మరియు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారని, అటువంటి నియోజకవర్గంలో నేరచరిత్ర ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని ఉప్పల్ పారికర్ వెల్లడించారు.

 మనోహర్ పారికర్ తనయుడికి కాకుండా బాబూష్ మోన్సెరేట్ కే టికెట్

మనోహర్ పారికర్ తనయుడికి కాకుండా బాబూష్ మోన్సెరేట్ కే టికెట్

మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్ 2019లో మరణించారు. 25 ఏళ్ల పాటు పనాజీ సీటులో మనోహర్ పారికర్ కొనసాగారు. పార్టీ కోసం విశేష సేవలను అందించారు. మనోహర్ పారికర్ మరణం తర్వాత జరిగిన ఉపఎన్నికలలో, అతని చిరకాల ప్రత్యర్థి, అత్యాచారం కేసులో నిందితుడైన బాబూష్ మోన్సెరేట్, కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. కానీ తరువాత బాబూష్ మోన్సెరేట్ బిజెపి తీర్థం తీసుకున్నారు. ఆయనకే మళ్ళీ పనాజీ నుండి పోటీ చేసే అవకాశం ఇచ్చారు.

Recommended Video

Palvancha Incident : Vanama Raghava పై ఇలాంటి కేసులు కొన్ని వందలు ఉన్నాయ్ | Oneindia Telugu
 ఉత్పల్ కు అండగా ఉంటామన్న శివ సేన

ఉత్పల్ కు అండగా ఉంటామన్న శివ సేన

ఉత్పల్ పారికర్ ఈసారి పనాజీ నియోజకవర్గం తనను నామినేట్ చేయాలని బిజెపిని కోరారు. అయితే పార్టీ మోన్సెరేట్‌ కు పనాజీ నుండి అవకాశం కల్పిస్తూ ఉత్పల్ పారికర్ వేరే నియోజకవర్గాన్ని తీసుకోవాలని సూచించింది. అయితే దానిని వ్యతిరేకించిన ఉత్పల్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. శివసేన మరియు అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉత్పల్ పారికర్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు శివసేన పనాజీ ఎన్నికల బరి నుండి ఉపసంహరించుకుని ఉత్పల్ కు మద్దతుగా నిలిచింది.

English summary
The Shiv Sena, which had kept its word on Utpal Parrikar, withdrew from the contest, saying it was supporting Utpal parrikar. Targeted the BJP shiv sena mp sanjay raut tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X