నల్ల కుబేరులకు 'షాక్' : రూ.5 వేలకు మించి డిపాజిట్ ఒక్కసారే
దేశంలో నోట్ల రద్దు నేపథ్యంలో నల్లదనం ఉన్న వారు ఇతరుల ఖాతాల్లో పాత నోట్లను జమచేయడం గమనించిన ఆర్బీఐ తాజాగా ఇప్పుడు బ్యాంకుల్లో రూ.5 వేలకు మించిన నగదు డిపాజిట్లపై కూడా పరిమితి విధించింది.
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో నగదు డిపాజిట్లపై ఆర్బీఐ పరిమితి విధించింది. తాజా ఆదేశాల ప్రకారం ఇకమీదట రూ.5 వేలకు పైబడిన నగదును ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలి. పైగా దీనికి గడువు కూడా డిసెంబర్ 30 మాత్రమే.
దీంతో నల్ల కుబేరుల గుండెల్లో మళ్ళీ రైళ్ళు పరిగెత్తడం మొదలైంది. ఇప్పటివరకు రోజువారీ పాతనోట్ల డిపాజిట్లపై ఆర్బీఐ ఎలాంటి పరిమితి విధించలేదు.

అయితే దేశంలో నోట్ల రద్దు నేపథ్యంలో నల్లదనం ఉన్న వారు ఇతరుల ఖాతాల్లో పాత నోట్లను జమచేయడం గమనించిన ఆర్బీఐ తాజాగా ఇప్పుడు బ్యాంకుల్లో రూ.5 వేలకు మించిన నగదు డిపాజిట్లపై కూడా పరిమితి విధించింది. ఆర్బీఐ తాజా చర్యతో నల్ల కుబేరులకు 'షాక్' తగిలినట్లయింది.












Click it and Unblock the Notifications