Shock: జ్యోతిలక్ష్మి ఫ్యామిలీ హ్యాపీ, పెద్ద కూతురి పెళ్లి ఫిక్స్, తల్లి కోరికతో కూతురు షాక్, మొత్తం రివర్స్ !

చెన్నై/రాణిపేట్: దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు పెళ్లి ఫిక్స్ అయ్యింది. నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్దం అయ్యారు. అనారోగ్యంతో ఉన్న తల్లి పెద్ద కుమార్తెను ఓ కోరిక కోరింది. తల్లి కోరిక తెలుసుకున్న కుమార్తె షాక్ అయ్యింది. తన పెళ్లి ఫిక్స్ అయిన సమయంలో తన తల్లి ఇలాంటి కోరిక ఎందుకు కోరింది ? అని కుమార్తె ఆవేదన చెందింది. ఒకేసారి తల్లీ, కూతురు ఆత్మహత్యాయత్నం చేశారు. తల్లి చనిపోవడంతో పెళ్లి చేసుకోవాల్సిన యువతి ఐసీయూలో చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యులు ఊహించిన కలలు మొత్తం రివర్స్ అయ్యయి.

జ్యోతిలక్ష్మి ఫ్యామిలీ హ్యాపీలైఫ్

జ్యోతిలక్ష్మి ఫ్యామిలీ హ్యాపీలైఫ్

తమిళనాడులోని రాణిపేట్ (వేలూరు జిల్లా సమీపం)లోని కావేరిపాక్కం సమీపంలోని కరివేడు ప్రాంతంలో మహాలింగం, జ్యోతిలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం చేసుకున్న మహాలింగం, జ్యోతిలక్షి దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. మహాలింగం సొంతంగా లారీ తీసుకుని అతనే నడుపుతున్నాడు.

జ్యోతిలక్ష్మికి ఆపరేషన్

జ్యోతిలక్ష్మికి ఆపరేషన్

మహాలింగం, జ్యోతిలక్షి దంపతులకు వైష్ణవి, పవిత్ర అనే ఇద్దరు కుమార్తెలు, భవానీ శంకర్ అనే కుమారుడు ఉన్నారు. కుమార్తెలు, కుమారుడితో మహాలింగం, జ్యోతిలక్షి దంపతులు చాలా సంతోషంగా జీవించారు. కొంతకాలం క్రితం జ్యోతిలక్ష్మికి గుండె ఆపరేషన్ జరగడంతో ఆమె బెడ్ రష్ట్ లో ఉంటోంది.

పెద్ద కూతురి పెళ్లి ఫిక్స్

పెద్ద కూతురి పెళ్లి ఫిక్స్

ఆర్కాట్ సమీపంలోని వలవనూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న సెల్వరాజ్ అనే యువకుడితో జ్యోతిలక్ష్మి, మహాలింగం దంపతుల పెద్ద కుమార్తె వైష్ణవికి పెళ్లి కుదిరింది, డిసెంబర్ 5వ తేదీన నిశ్చితార్థం చేసుకుందామని ఇరువైపుల కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. ఇప్పటికే పెళ్లికి అన్ని చర్చలు జరిగిపోయాయి.

తల్లి కోరికతో కూతురికి షాక్

తల్లి కోరికతో కూతురికి షాక్

అనారోగ్యంతో బాధపడుతున్న జ్యోతిలక్ష్మి ఆమె పెద్ద కుమార్తె వైష్ణవిని తనకు గన్నేరుపప్పు తినాలని ఉందని చెప్పింది. తల్లి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందని తెలుసుకున్న ఆమె కుమార్తె వైష్ణవి షాక్ అయ్యింది. తన పెళ్లి ఫిక్స్ అయిన సమయంలో తన తల్లి జ్యోతిలక్ష్మి ఆత్మహత్య చేసేసుకోవాలని చెప్పడంతో వైష్ణవి హడలిపోయింది.

పెళ్లి చేసుకోవాల్సిన కూతురు ఏం చేసిందంటే ?

పెళ్లి చేసుకోవాల్సిన కూతురు ఏం చేసిందంటే ?

నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు, నా పెళ్లి సమయంలో ఇలాంటి కోరిక ఎందుకు కోరావు అని జ్యోతిలక్ష్మి కుమార్తె వైష్ణవి ఆవేదన చెందింది. చివరికి వైష్ణవి తనకు పెళ్లి ఫిక్స్ అయ్యింది అనే విషయం మరిచిపోయి ఆమె తల్లీ జ్యోతిలక్ష్మి కోరిక మేరకు గన్నేరు పప్పు నూరి ఒకేసారి తల్లీ, కూతురు తినేసి ఆత్మహత్యాయత్నం చేశారు.

తల్లి ప్రాణం పోయింది.... ఐసీయూలో కూతురు

తల్లి ప్రాణం పోయింది.... ఐసీయూలో కూతురు

వెంటనే తల్లీ కూతురిని వేలూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై జ్యోతిలక్ష్మి చనిపోవడంతో పెళ్లి చేసుకోవాల్సిన వైష్ణవి ఐసీయూలో చికిత్స పొందుతోంది. జ్యోతిలక్ష్మి, పెళ్లి చేసుకోవాలన్సిన వైష్ణవి తీసుకున్న నిర్ణయంతో వాళ్ల కుటుంబ సభ్యులు ఊహించిన కలలు మొత్తం రివర్స్ అయ్యయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+