Shock: ఎంజాయ్ చేశాడు, భార్య లేడీ టెక్కీ, భార్య మీద కోపంతో ఇద్దరు పిల్లలను చంపేసి చివరికి కుక్కచావు !

బెంగళూరు: ఉద్యోగం చెయ్యడానికి బెంగళూరు వచ్చిన యువకుడు కొంతకాలం ఉద్యోగం చేశాడు. లేడీ సాఫ్ట్ వేర్ ఇంజనీరును పెళ్లి చేసుకున్న అతను కూతురు, కొడుక్కి తండ్రి అయ్యాడు. కొంతకాలానికి ఉద్యోగం మానేసిన వ్యక్తి ఇంట్లో పిల్లలను చూసుకుంటుంటే అతని భార్య సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. ప్రతిరోజు ఉదయం భార్యను ఆఫీసు దగ్గర డ్రాప్ చెయ్యడం, సాయంత్రం ఇంటికి పిలుచుకుని రావడం భర్తకు డ్యూటీగా మారిపోయింది. పగటి పూట ఇంట్లో పిల్లలను చూసుకుంటున్నాడు. ఇంట్లో ఉంటున్న భర్త విలాసాలకు అలవాటు పడి రోజురోజుకు ఎక్కువ ఖర్చులు పెట్టడం మొదలు పెట్టాడు. భర్త విపరీతంగా ఖర్చులు పెడుతున్నాడని అతన్ని భార్య మందలించింది .ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రానురాను భార్య లేటుగా ఇంటికి వస్తోందని భర్తకు ఇంకా కోపం ఎక్కువ అయ్యింది. భార్య మీద కోపంతో కన్న బిడ్డలను ఇద్దరిని దారుణంగా చంపేశాడు. బిడ్డల హత్య కేసులో సెంట్రల్ జైల్లో ఉంటున్న అతను కోర్టు వాయిదాకు వెళ్లాడు. పోలీసులు పక్కనే ఉన్న సమయంలో కోర్టు ఐదవ అంతస్తు నుంచి కిందకు దూకేసిన నిందితుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 లేడీ టెక్కీతో పెళ్లి

లేడీ టెక్కీతో పెళ్లి

ఉత్తర భారతదేశానికి చెందిన జతిన్ అనే యువకుడు కొన్ని సంవత్సరాల క్రితం ఉద్యోగం చెయ్యడానికి బెంగళూరు వచ్చాడు. బెంగళూరులో జతిన్ కొంతకాలం ఉద్యోగం చేశాడు. లేడీ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న లక్షేశ్వరి అనే యువతిని పెళ్లి చేసుకున్న జతిన్ ఆమెతో కాపురం చేశాడు. జతిన్, లక్షేశ్వరి దంపతులు కూతురు (5), కొడుకు (18 నెలలు) తల్లిదండ్రులు అయ్యారు.

 ఉద్యోగం మానేసిన లెక్కీ భర్త

ఉద్యోగం మానేసిన లెక్కీ భర్త

తిన్, లక్షేశ్వరి దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి హుళిమావు సమీపంలోని లగ్జరీ అపార్ట్ మెంట్ లో 2018లోనే కాపురం పెట్టారు. కొంతకాలానికి ఉద్యోగం మానేసిన జతిన్ ఇంట్లో పిల్లలను చూసుకుంటుంటే అతని భార్య లక్షేశ్వరి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. ప్రతిరోజు ఉదయం భార్య లక్షేశ్వరిని ఆఫీసు దగ్గర డ్రాప్ చెయ్యడం, సాయంత్రం ఇంటికి పిలుచుకుని రావడం జతిన్ కు డ్యూటీగా మారిపోయింది.

 విలాసాలకు బానిస అయ్యాడు

విలాసాలకు బానిస అయ్యాడు

జతిన్ పగటి పూట ఇంట్లో పిల్లలను చూసుకుంటూ కాలం గడిపేశాడు. ఇంట్లో ఉంటున్న జతిన్ విలాసాలకు అలవాటు పడి రోజురోజుకు ఎక్కువ ఖర్చులు పెట్టడం మొదలు పెట్టాడు. భర్త జతిన్ విపరీతంగా ఖర్చులు పెడుతున్నాడని అతన్ని భార్య లక్షేశ్వరి మందలించింది .ఇదే విషయంలో జతిన్, లక్షేశ్వరి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

ఇద్దరు బిడ్డలను చంపేశాడు

ఇద్దరు బిడ్డలను చంపేశాడు

రానురాను భార్య లక్షేశ్వరి లేటుగా ఇంటికి వస్తోందని జతిన్ ఆమె మీద ఇంకా కోపం ఎక్కువ పెంచుకున్నాడు. 2020 మార్చి 20వ తేదీన లక్షేశ్వరి ఉద్యోగానికి వెళ్లింది. అదే రోజు భార్య లక్షేశ్వరి మీద కోపంతో కన్న కూతురు, కొడుకు ముఖం మీద తలదిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి ఇద్దరిని ఒకేసారి దారుణంగా చంపేశాడు.

 ఆత్మహత్య కేసుకున్న కిరాతకుడు

ఆత్మహత్య కేసుకున్న కిరాతకుడు

ఇద్దరు బిడ్డల హత్య కేసులో హుళిమావు పోలీసులు జతిన్ ను అరెస్టు చేసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి సెంట్రల్ జైల్లో ఉంటున్న జతిన్ ను బుధవారం (నిన్న) బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వాయిదాకు వెళ్లిన జతిన్ పోలీసులు పక్కనే ఉన్న సమయంలో కోర్టు ఐదవ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. తీవ్రగాయాలైన జతిన్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై జతిన్ చనిపోయాడని గురువారం పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+