దీదీపై బీజేపీ సంచలన పోస్టు.. హిట్లర్ తో పోల్చుతూ..

వచ్చే ఏడాది బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటినుంచే అక్కడి రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఎలాగైనా బెంగాల్ లో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు మెదలుపెట్టింది. మరోవైపు అధికారాన్ని కాపాడుకునేందుకు మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ సర్వశక్తులూ వడ్డుతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి పశ్చిమ్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఇప్పటికే వరుసగా మూడు సార్లు రాష్ట్రంలో విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ ను ఎలాగైనా ఈ ఎన్నికల్లో పడగొట్టాలని బీజేపీ యత్నిస్తోంది.

ఈ క్రమంలో బెంగాల్ లో రాజకీయ వేడి అలుముకుంది. ప్రత్యర్థి, అధికార పార్టీ నేతల మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో.. బీజేపీ బెంగాల్ యూనిట్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని కొత్త వివాదానికి తెరలేపింది.

బెంగాల్ బీజేపీ తన సోషల్ మీడియా పోస్ట్‌ లో మమతా బెనర్జీని "నియంత" గా అభివర్ణిస్తూ, అడాల్ఫ్ హిట్లర్‌ తో పోల్చింది. మమతా బెనర్జీ ముఖాన్ని హిట్లర్ ముఖంతో కలిపి, "The dictator is rattled" అనే క్యాప్షన్ జత చేసింది. ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. బెంగాల్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీదీని హిట్లర్ తో పోల్చడంపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అటు బీజేపీ నేతలు కూడా దీదీపై కీలక ఆరోపణలు చేస్తూ కాలు దువ్వుతున్నారు. దీంతో కొన్ని నెలల ముందే బెంగాల్ లో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరినట్లుగా భావించవచ్చు.

Shocker from Bengal BJP Mamata Banerjee Compared to Hitler in Viral Post

మరోవైపు బెంగాల్‌ లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతోంది. తాజా సవరణల్లో భాగంగా ఓటర్ల జాబితా నుంచి 58 లక్షలకు పైగా ఓట్లను తొలగించేందుకు ఎన్నికల అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ (EC) ఆదివారం సాయంత్రం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణను ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. అలా సవరించిన ఎలక్టోరల్‌ రోల్స్‌ ను డిసెంబర్ 16 న ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.

మరోవైపు అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ గోట్ టూర్ లో భాగంగా ఇటీవల కోల్​ కతాలోని స్టేడియంలోకి వచ్చాడు. ఈ క్రమంలో స్టేడియంలో గందరగోళం జరిగింది. ఈవెంట్ భద్రతా కారణాల వల్ల​ ఫెయిల్ అయింది. దీంతో భారీగా డబ్బు చెల్లించి టిక్కెట్లు కొన్న అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఇక ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ క్షమాపణ చెప్పారు. తాను చాలా కలత చెందానని, షాక్ అయ్యానని అన్నారు.

అయితే మమతా వ్యాఖ్యలను బెంగాల్ బీజేపీ.. మొసలి కన్నీళ్లు అని ఆరోపించింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌, ఫుట్‌బాల్ క్రీడకు అవమానం అని పేర్కొంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ గందరగోళానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని తేల్చాయి. అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్ మాత్రం.. ఈ కార్యక్రమం ప్రభుత్వానికి కాదని, ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహించిందని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+