వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: 48 గంటల్లోనే 30 మంది చిన్నారుల మృతి

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గంలో ఘోరం చోటుచేసుకొంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారులు మృతి చెందారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గంలో ఘోరం చోటుచేసుకొంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారులు మృతి చెందారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లోని బిడిఎస్ ఆసుపత్రిలో చిన్నారులు 30 మృతిచెందారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకనే చిన్నారులు మృతిచెందారు. గురువారం నాడు 20 మంది చనిపోగా, శుక్రవారం నాడు 10 మంది మరణించారు.

Shocking! 30 children die in Gorakhpur hospital after oxygen supply cut

ఈ ఆసుపత్రికి ఆక్సిజన్‌ను సరఫరా చేసే కాంట్రాక్ట్ సంస్థకు ఆసుపత్రి సుమారు 70 లక్షల రూపాయాలను బకాయి పడి ఉందని సమాచారం. దీంతో ఆ కాంట్రాక్ట్ సంస్థ ఆసుపత్రికి ఆక్సిజన్‌ను సరఫరా చేయడాన్ని నిలిపివేసినట్టు ప్రచారం సాగుతోంది.

అయితే ఆసుపత్రివర్గాలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. వివిద కారణాలతోనే చిన్నారులు మరణించారని వైద్యులు చెబుతున్నారు.

యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ మంగళవారం నాడే ఈ ఆసుపత్రి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ ఘటన జరిగిన తర్వాత బిడిఎల్ ఆసుపత్రిలో 30 మంది మరణించారు.

English summary
As many as 30 children lost their lives due to encephalitis in last 48 hours at Gorakhpur’s BRD Hospital, The children died allegedly after oxygen supply was cut. Gorakhpur is Uttar Pradesh CM Yogi Adityanath’s former Parliamentary constituency. Earlier, on August 9, UP Chief Minister had gone to the hospital for inspection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X