షాకింగ్ క్రైమ్: కుక్క శవం కింద భార్య మృతదేహం.. భర్త దారుణ కుట్ర!
జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసిన ఓ దారుణమైన హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రియురాలి కోసం భార్యను హతమార్చిన ఓ భర్త.. ఆ నేరం బయటపడకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నం వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
అసలేం జరిగిందంటే?
జార్ఖండ్‌లోని బిశ్రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిసిబార్ దారువా గ్రామానికి చెందిన రంజిత్ మెహతాకు ప్రియాంక దేవి అలియాస్ పూజతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. అయితే రంజిత్‌కు మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించి, ప్రియురాలితో కలిసి భార్యను వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు.

శవంపైన కుక్కను పాతిపెట్టి..
ఈ క్రమంలోనే భార్యను రంజిత్ హత్య చేశాడు. డిసెంబర్ 26న ప్రియాంక అదృశ్యమైంది. తన ప్రియురాలి గ్రామం (తుక్బెరా) సమీపంలోని ఖాళీ స్థలంలో భార్యను చంపి పాతిపెట్టాడు రంజిత్. అయితే శవం కుళ్లిపోతే వచ్చే దుర్వాసన వల్ల తన నేరం బయటపడుతుందని అతడు భయపడ్డాడు. దుర్వాసనను కప్పిపుచ్చడానికి రంజిత్ ఒక కుక్కను చంపి, భార్య శవం ఉన్న గుంతలోనే పైన పడేశాడు.ఎవరైనా వాసన వస్తుందని అడిగితే, అక్కడ చచ్చిన కుక్కను పాతిపెట్టానని నమ్మించడానికి ఈ పని చేశాడు. గ్రామస్థులను నమ్మించడానికి 4 రోజుల తర్వాత మళ్లీ అక్కడ గుంత తవ్వి, కుక్కను పాతిపెడుతున్నట్టు నాటకం ఆడాడు.
రంగంలోకి పోలీసులు.. బయటపడిన అసలు నిజం
ప్రియాంక ఆచూకీ తెలియకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు, మెజిస్ట్రేట్ సమక్షంలో జేసీబీ సాయంతో అనుమానిత స్థలంలో తవ్వకాలు చేపట్టారు. సుమారు 5 అడుగుల లోతులో కుక్క శవం కింద ప్రియాంక మృతదేహం లభ్యమైంది. భర్త, ప్రియురాలు, ఆమె తండ్రి కలిసి ఈ కుట్ర పన్నినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
నిందితులు పరారీ
మృతదేహం లభ్యం కావడంతో నిందితులపై హత్య, కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసం వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడైన భర్త రంజిత్, అతని ప్రియురాలు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications