సర్వేలో షాకింగ్ సమాచారం, ఏ పార్టీకి ఎన్నిసీట్లు అంటే, మైండ్ బ్లాక్ !
బెంగళూరు/మంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, కర్ణాటక కింగ్ మేకర్ ఎవరు ?, కర్ణాటకకు కాబోయే సీఎం ఎవరు అంటూ ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతోంది. పలు మీడియా సంస్థలు. పలు సంస్థల సర్వేలల్లో షాకింగ్ విషయాలు బయటకు వస్తుండటంతో పలు పార్టీల నాయకులు టెన్షన్ తో హడలిపోతున్నారు.
తాజాగా టీవీ 9- సీ ఓటర్స్ సర్వేతో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. మంగళవారం రాత్రి టీవీ 9, సీ- ఓటర్స్ సర్వే విడుదల అయ్యింది. ఇంతకాలం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయులు ఈ సర్వే ఫలితాలు చూసి కొందరు షాక్ కావడంతో మరి కొందరు నాయకులు లైట్ గా తీసుకుంటున్నారు.

గతంలో చాలా ఏళ్ల పాటు కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. సిద్దరామయ్య ఐదు సంవత్సరాలు పూర్తి కాలం సీఎంగా ఉన్నారు. సిద్దరామయ్య సీఎం కాకముందు. ఆయన సీఎం పదవి నుంచి దిగిపోయిన తరువాత కూడా కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాలే కొనసాగాయి. బీజేపీ. కాంగ్రెస్ పార్టీలు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యలేకపోయాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అంటూ టీవీ 9, సీ- ఓటర్స్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు 106 నుంచి 116 సీట్లు వస్తాయని, బీజేపీకి 70 నుంచి 89 సీట్లు వస్తాయని టీవీ 9, సీ ఓటర్స్ సర్వేలో వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

చాలా సంవత్సరాల నుంచి కర్ణాటకలో కింగ్ మేకర్ గా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న జేడీఎస్ పార్టీ నాయకుడు హెచ్.డీ. కుమారస్వామి పార్టీకి ఈ ఎన్నికల్లో కేవలం 23 నుంచి 34 సీట్లు మాత్రమే వస్తాయని, గతంలో కంటే జేడీఎస్ పార్టీ చాలా సీట్లు కోల్పోతుందని సర్వేలో వెలుగు చూసింది. ఇక ఇతర పార్టీలకు చెందిన సుమారు ఐదు మంది విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications