అర్ధనగ్నంగా యువకుడిని రైలు కిటీకి కట్టేసి చితకొట్టారు (వీడియో)

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. రైలు జర్నీలో భాగంగా త్రాగు నీరు విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఓ యువకుడితో కొంతమంది యువకులు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారింది. చివరకు ఆ యువకుడిని అర్ధనగ్నంగా రైలు కిటీకీకి కట్టేసి చితకబాదారు.

రైలులో ఓ యువకుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని టార్సీ రైల్వే స్టేషన్‌లో 25న చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... తమ బాటిల్ లోని మంచినీళ్లు తాగాడనే కోపంతో యువకుడిపై ముగ్గురు దాడి చేశారు.

కర్రలు తీసుకుని ఆ యువకుడిని చితకబాదారు. అక్కడితో ఆగకుండా ఆ యువకుడి ప్యాంట్ ఊడదీసి అతడి రెండు కాళ్లను రైలు కిటికీకి కట్టేశారు. అయితే ఈ సంఘటన జరుగుతున్నంత సేపు అక్కడికి రైల్వే పోలీసులు రాకపోవడం విశేషం. యువకుడిని ఒక్కడిని చేసి అల్లరి మూక చిత్రహింసలు గురి చేస్తుంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు.

ఈ దారుణమైన ఘటన ఫొటోలు సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే, ఓ గుర్తు తెలియని వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి మీడియాకు అందజేశారు.

ఈ వీడియోలో అమానవీయంగా దెబ్బలు తిన్న యువకుడిని సుమిత్ కాచీగా పోలీసులు గుర్తించారు. జబల్ పూర్‌కు చెందిన సుమిత్ ఈ ఘటనపై కేవలం త్రాగు నీటి విషయంలోనే మా మధ్య గొడవ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాను ఓ పని నిమిత్తం జబల్ పూర్‌లో పాటలీపుత్ర-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కినట్లు పేర్కొన్నాడు. రైలు మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీకు చేరుకోగానే కొంత మంది యువకులు తనపై దాడి చేశారని పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+