షారుక్‌తో వివాహం, ఉదిత్‌తో ప్రేమ.. భర్తను ఇరికించేందుకు కూతురి హత్య!
Lucknow Shocker: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఓ దారుణ ఘటన సంచలనం సృష్టించింది. ఓ కసాయి తల్లి ఎవరూ ఊహించిన దారుణానికి పాల్పడింది. లక్నోలో రోష్ని అనే మహిళ తన ప్రియుడితో కలిసి తన అమాయకురాలైన కన్నకూతురినే హత్య చేసింది. దాదాపు 36 గంటల పాటు మృతదేహం ఇంట్లోనే కుళ్లిపోతున్నా.. ఎవరీ అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. చివరికి కూతురి హత్య ఆరోపణను తన భర్తపై మోపింది. అయితే పోస్టుమార్టం రిపోర్టు, ఇతర ఆధారాలు ఆ రాక్షస తల్లి బండారాన్ని బయటపెట్టాయి. ప్రస్తుతం పోలీసులు చిన్నారిని హత్య చేసిన కసాయి తల్లి రోష్నిని, ఆమె ప్రియుడు ఉదిత్‌ను అరెస్ట్ చేశారు. అసలు రోష్ని తన ఆరేళ్ల కూతురిని ఎందుకు హత్య చేసింది. భర్త షారుఖ్ ఖాన్‌ను వదిలి ఉదిత్‌కు ఎలా దగ్గరైందో తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే?
వాస్తవానికి ఈ మొత్తం ఘటన లక్నోలోని కైసర్‌బాగ్ ప్రాంతంలో జరిగింది. అక్కడ నివసించే షారుఖ్ ఖాన్‌కు 8 ఏళ్ల క్రితం రోష్ని అనే అమ్మాయితో వివాహం జరిగింది. రోష్ని ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి. ఆమెకు పార్టీలకు, క్లబ్‌లకు వెళ్లడం అంటే ఇష్టం. ఆమెకు డ్యాన్స్ అంటే కూడా ఇష్టం. మొదట్లో షారుఖ్ ఖాన్‌కు ఇదంతా బాగానే అనిపించినా తర్వాత విభేదాలు వచ్చాయి. దీంతో నెమ్మదిగా వారిద్దరి మధ్య సంబంధాలు క్షీణించాయి. వివాహం జరిగిన కొంతకాలానికి వారికి ఒక కూతురు పుట్టింది. కానీ రోష్ని అదే లైఫ్ స్టైల్ కొనసాగించింది. ఒకరోజు క్లబ్‌లో పార్టీలో ఉదిత్ జైస్వాల్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయమైంది. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది, ఆపై వారు కలిసి జీవించడం ప్రారంభించారు. రోష్ని భర్తను వదిలి ఉదిత్‌తో సహజీవనం కూడా మొదలుపెట్టింది. కూతురును కూడా తనతో పాటు తీసుకువచ్చింది.

భర్తను ఇరికించడానికి ప్లాన్
రోష్ని షారుఖ్ ఖాన్ ఇంటిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో అతనిపై, అతని కుటుంబ సభ్యులపై దాడితో సహా అనేక తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనితో అతని కుటుంబ సభ్యులు జైలుకు కూడా వెళ్లారు. తర్వాత రాజీ కుదరగా.. రోష్ని ఇంటిని ఆక్రమించి షారుఖ్ ఖాన్‌ను కూడా బయటకు పంపేసింది. తన ప్రియుడితో ఆ ఇంటిలో హాయిగా నివసించడానికి షారుఖ్ ఖాన్‌ను ఇరికించాలని ఆమె ప్లాన్ చేస్తోంది. ఘటన జరిగిన రోజు అంటే సోమవారం రాత్రి షారుఖ్ తన కూతురిని చూడటానికి ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో రోష్ని, షారుఖ్ మధ్య ఏదో విషయంలో వాదన జరిగింది. దీంతో రోష్ని కోపంతో తన కూతురిని గొంతు నులిమి చంపింది. ఆపై భర్తను ఇరికించడానికి భయంకరమైన కుట్ర పన్నింది. అయితే ఆమె అబద్ధం ఎక్కువ కాలం నిలబడలేదు.
పోలీసుల దర్యాప్తులో బయటపడిన బండారం
రోష్ని మరుసటి రోజు షారుఖ్ ఖాన్ పై హత్య ఆరోపణలు చేసినప్పుడు పోలీసులకు అనుమానం వచ్చింది. మృతదేహం పరిస్థితిని చూస్తే కొన్ని గంటల క్రితం హత్య జరిగినట్లు అనిపించలేదు. దీనితో పాటు విచారణ సమయంలో రోష్ని నిరంతరం తన స్టేట్‌మెంట్లను మారుస్తూనే ఉంది. ఒకదాని తర్వాత ఒకటిగా పోలీసులను తప్పుదోవ పట్టించింది. చివరికి పోస్టుమార్టం నివేదిక వచ్చినప్పుడు ఆ పసిపాప హత్య 36 గంటల క్రితం జరిగిందని వెల్లడైంది. లొకేషన్ చెక్ చేయగా.. ఆ సమయంలో షారుఖ్ ఆ ప్రాంతంలో లేడని తెలిసింది. దీంతో రోష్ని అబద్ధాలు చెప్పిందని తెలిసిపోయింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె హత్య చేసినట్లు అంగీకరించింది. ఆమె ప్రియుడు ఉదిత్ కూడా తన నేరాన్ని అంగీకరించాడు.
-
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications