పూజించిన చేతులతోనే శబరిమల అయ్యప్ప స్వామి బంగారాన్ని దోచుకున్న ప్రధాన తంత్రి
కేరళలో సంచలనం రేపిన శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును ఎట్టకేలకు ఛేదించారు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు. ఈ కేసులో కింగ్ పిన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు చోరీకి మూలం ఎక్కడో సిట్ అధికారులు గుర్తించారు. ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేశారు. దీంతో చాలాకాలంగా మింగుడు పడని విధంగా ఈ చోరీ వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టయింది.
ఆ ప్రధాన సూత్రాధారి మరెవరో కాదు.. ఆలయ ప్రధాన అర్చకుడు కందరారు రాజీవరు. ఆయనను సిట్ అరెస్ట్ చేసింది. ఈ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పోట్టిని శబరిమలకు తీసుకువచ్చింది ఆయనేనని దర్యాప్తులో తేలింది. ట్రావెన్ కూర్ దేవస్వొం బోర్డు నుంచి జీతం పొందుతున్నందున రాజీవరు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తారని సిట్ గుర్తించింది. ఉన్నికృష్ణన్ చోరీకి పాల్పడిన విషయం రాజీవరుకు ముందే తెలుసునని దర్యాప్తు బృందం వెల్లడించింది.

గత రెండు రోజులుగా సిట్ విచారణకు పిలిచినా, ఆరోగ్య సమస్యలను కారణం చూపి తంత్రి హాజరును తప్పించుకున్నారు. అదే సమయంలో ఆయన ఇచ్చిన మూడు అంగీకార పత్రాలు అనుమానాస్పదంగా ఉన్నాయని సిట్ పేర్కొంది. తంత్రిపై అవినీతి నిరోధక చట్టం వర్తింపుపై తలెత్తిన ప్రశ్నలకు సమాధానంగా సిట్ ఆధారాలు సేకరించింది. ఈ ఉదయం నుండి ఎస్పీ శశిధరన్ ఆధ్వర్యంలో ఓ రహస్య ప్రదేశంలో ఆయనను విచారించారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసినట్లు శశిధరన్ తెలిపారు.
దేవస్వొం బోర్డు అధ్యక్షుడు, సీపీఎం నాయకుడు ఏ పద్మకుమార్ గతంలో పలుమార్లు ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఒకరిద్దరు "దైవ సమానులు సైతం శబరిమల ఆలయం బంగారం చోరీ వెనుక ఉన్నారని పేర్కొన్నారు. దర్యాప్తు బృందానికి కడకంపల్లి సురేంద్రన్ లేదా తంత్రిలలో ఎవరు ప్రమేయం ఉన్నారనే దానిపై మొదట్లో సందేహాలు కలిగాయి. శబరిమల స్వర్ణ చోరీ వ్యవహారంలో నల్లధనం లావాదేవీలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ధారించింది.
ఈ దర్యాప్తులో భాగంగా సిట్ సేకరించిన అన్ని ఆధారాలను ఈడీకి బదిలీ చేయాలని కొల్లంలోని విజిలెన్స్ కోర్టు ఆదేశించింది. ఈ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, డైరెక్టరేట్ అనుమతి పొందిన తర్వాత, ఈడీ ప్రస్తుతం ఈ ఆర్థిక లావాదేవీలపై అధికారికంగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తును ప్రారంభించింది. దీంతో మరిన్ని అరెస్టులు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications