'మానవత్వం మంటగలిసింది':హోంవర్క్ చేయలేదని 4 ఏళ్ల చిన్నారిని..!!

పాఠశాలల్లో పిల్లల భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతూ ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో ఒక భయంకరమైన ఘటన వెలుగు చూసింది. హోంవర్క్ పూర్తి చేయలేదనే నెపంతో హన్స్ వాహిని విద్యామందిర్‌కు చెందిన ఇద్దరు మహిళా ఉపాధ్యాయినులు నలుగురు సంవత్సరాల విద్యార్థిని దారుణంగా శిక్షించారు.

ఆ చిన్నారిని బట్టలు విప్పి, తాడుతో కట్టి, ఏకంగా స్కూల్ ప్రాంగణంలోని చెట్టుకు వేలాడదీశారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

shocking-video-chhattisgarh-teachers-strip-and-hang-4-year-old-boy-from-tree-for-not-doing-homework

నారాయణపూర్ గ్రామంలోని హన్స్ వాహిని విద్యామందిర్ (న‌ర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న పాఠశాల)లో సోమవారం ఉదయం క్లాసులు యథావిధిగా ప్రారంభమయ్యాయి. నర్సరీ క్లాస్‌లో టీచర్ కాజల్ సాహు హోంవర్క్ చెక్ చేస్తుండగా, ఒక చిన్నారి తన హోంవర్క్ పూర్తి చేయలేదని గుర్తించింది. దీంతో ఆగ్రహించిన టీచర్, ఆ చిన్నారిని తరగతి గది నుంచి బయటకు పంపి, యావత్ గ్రామాన్ని నివ్వెరపరిచే శిక్ష విధించింది.

ఆమె ఆ చిన్నారి షర్ట్‌ను తాడుతో కట్టి, స్కూల్ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు ఉరి వేసినట్లుగా వేలాడదీసింది. ఆ నాలుగేళ్ల చిన్నారి గంటల తరబడి నిస్సహాయంగా గాలిలో వేలాడుతూ కేకలు వేస్తూ, వదిలిపెట్టమని టీచర్‌ను వేడుకున్నా, ఆమె పట్టించుకోలేదు.

వైరల్ అయిన సీసీటీవీ దృశ్యాలు:
పక్కనే ఉన్న భవనం పైనుంచి ఓ యువకుడు ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోలో, చిన్నారి నిస్సహాయంగా వేలాడుతుండగా, ఇద్దరు ఉపాధ్యాయినులు-కాజల్ సాహు మరియు అనురాధ దేవంగన్-దగ్గరలో నిలబడి ఉన్నారు.

కుటుంబ సభ్యుడైన సంతోష్ కుమార్ సాహు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పాఠశాల నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పించారు. ఈ అమానుష శిక్ష విధించిన ఉపాధ్యాయినులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అధికారుల విచారణ, టీచర్‌పై చర్యలు:

వీడియో వైరల్ కావడంతో బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) డీఎస్ లక్రా వెంటనే పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) అజయ్ మిశ్రా కూడా ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని ధృవీకరించారు.

క్లస్టర్ ఇన్‌ఛార్జ్ మనోజ్ యాదవ్ కూడా విచారణ జరిపి, టీచర్లు చేసింది తప్పే అని తేల్చారు. ఈ దారుణంపై స్కూల్ యాజమాన్యం కూడా పొరపాటును అంగీకరిస్తూ,ఈ చర్యను సంహచరాని నేరంగా అభివర్ణించి బహిరంగంగా క్షమాపణ చెప్పింది. నిందితురాలైన టీచర్లలో ఒకరు,తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంటూ.. అయితే కావాలని ఇది చేయలేదని మీడియాతో అన్నారు.

ప్రస్తుతం ఆ చిన్నారి సురక్షితంగా ఉన్నప్పటికీ, ఈ ఘటన తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. కేవలం ఉపాధ్యాయినులపైనే కాకుండా, పాఠశాల యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. రామానుజ్‌నగర్ బీఈఓ, బీఆర్‌సీలను విచారణకు పంపామని, నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+