వామ్మో.. కోడలు ఉరేసుకుంటుంటే వీడియో.. అత్తమామలు కాదు..
ఇదీ కలికాలమే.. తప్పు అనే భావన కాదు, చనిపోతుంటే కూడా వీడియో తీస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్‌లో జరిగిన ఘటన కలకలం రేపింది. కోడలు ఉరివేసుకునే సమయంలో కిటికీలోంచి వీడియో తీసిన అత్తమామల ఉదంతం బయటకు వచ్చింది. తర్వాత దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం.. ఆ వీడియో వైరల్ కావడంతో చర్చానీయాంశమైంది.

అత్తమామలు కాదు...
కోడలు ఉరేసుకోవడంలో తమకు సంబంధం లేదని అత్తమామలు అంటున్నారు. బాధితురాలు కోమల్ ముజఫర్‌నగర్‌లోని డాటియానా గ్రామంలో భర్త ఆశిష్, అత్తమామలతో కలిసి ఉండేది. అత్తమామల వేధింపులు భరించలేక మనస్తాపంతో గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. ఇదీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఉరి వేసుకునేందుకు దుపట్టా కట్టిన కోమల్ అది గట్టిగా ఉన్నదా, లేదా లాగి చూస్తోంది. ఆమెకు ఆమె ఉరివేసుకుంటోంది అని అరవడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.

ఆపినట్టు లేదే..
ఆమెను ఆపాలని ప్రయత్నించామని అత్తమామలు చెబుతున్నారని, కానీ వారి వేధింపులు భరించలేకే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని కోమల్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 2019లో వారికి వివాహం జరిగిందని, అప్పటి నుంచి ఆమెను కట్నం కోసం వేధిస్తున్నారని కోమల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లి సమయంలో రూ. 5 లక్షల కట్నం, బైక్ ఇచ్చానని, అయినప్పటికీ ఆశిష్ తల్లిదండ్రులు దేవేంద్ర, సవిత, ఆశిష్ సోదరుడు సచిన్ సంతోషంగా లేరని బాధితురాలి తండ్రి అనిల్ కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొట్టి గెంటేసి
ఆరు నెలల క్రితం కూడా ఆమెను కొట్టి బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఆమెను తిరిగి ఇంట్లోకి రానిచ్చారని పేర్కొన్నారు. రెండు నెలల క్రితం కూడా కోమల్ అత్తమామలు ఆమెను బెదిరించారని, రూ. 1.2 లక్షలు తీసుకురాకుంటే కుమారుడికి మరో పెళ్లి చేస్తామని హెచ్చరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications